Google Pay: గూగుల్‌ పేలోనూ యూపీఐ లైట్‌.. ఇక పిన్‌ లేకుండానే పేమెంట్స్‌

Google pay: గూగుల్‌ పే వాడుతున్నారా? ఇక పిన్‌తో పనిలేకుండానే పేమెంట్లు చేసేందుకు యూపీఐ లైట్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

Published : 14 Jul 2023 02:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌కు చెందిన చెల్లింపు సేవల సంస్థ గూగుల్‌ పే (Google Pay) తమ యూజర్ల కోసం కొత్త సదుపాయం తీసుకొచ్చింది. స్వల్ప మొత్తంలో చెల్లింపులకు ఉద్దేశించిన యూపీఐ లైట్‌ (UPI Lite) ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌తో రూ.200 వరకు లావాదేవీలకు ఎలాంటి పిన్‌ నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి.

యూపీఐ లైట్‌ వ్యాలెట్‌లోకి గరిష్ఠంగా రూ.2 వేల వరకు మొత్తాన్ని లోడ్‌ చేసుకోవచ్చు. పీక్‌ అవర్స్‌లోనూ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని గూగుల్‌ పే హామీ ఇస్తోంది. యూపీఐ లైట్ లావాదేవీ వల్ల బ్యాంక్‌ పాస్‌ బుక్‌లోనూ చిన్న చిన్న లావాదేవీలు నమోదుకాకుండా ఉంటాయి. ప్రస్తుతం 15 బ్యాంకులు యూపీఐ లైట్‌కు సపోర్ట్‌ చేస్తున్నాయి.

గూగుల్‌ పేలో యూపీఐ లైట్‌ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ముందుగా గూగుల్‌ పే యాప్‌లోని ప్రొఫైల్‌ ఐకాన్‌పై క్లిక్‌చేయాలి. కాస్త దిగువకు వస్తే అక్కడ యూపీఐ లైట్‌ యాక్టివేషన్‌కు సంబంధించిన ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి యాపీఐ లైట్‌ యాక్టివేషన్‌కు సంబంధించిన సూచనలు పాటించి యూపీఐ లైట్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు కావాల్సిన మొత్తాన్ని వ్యాలెట్‌లో లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని