Hero Xoom 110: హీరో మోటోకార్ప్‌ నుంచి జూమ్‌.. ప్రారంభ ధర ఎంతంటే?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) మరో కొత్త స్కూటర్‌ని లాంచ్‌ చేసింది. ఫిబ్రవరి నుంచి బుకింగ్‌లు చేసుకోవచ్చని తెలిపింది.

Updated : 30 Jan 2023 20:42 IST

దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) హీరో జూమ్‌ 110 పేరిట కొత్త స్కూటర్‌ను సోమవారం లాంచ్ చేసింది. LX, VX, ZX మూడు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను తీసుకొస్తోంది. వీటిలో ఎల్‌ఎక్స్‌ ధర రూ.68,599 (ఎక్స్‌షోరూం), వీఎక్స్‌ ధర రూ.71,799 (ఎక్స్‌షోరూం), జెడ్‌ఎక్స్‌ ధర రూ. 76,699 (ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ఫిబ్రవరి నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయని హీరోమోటోకార్ప్‌ వెల్లడించింది.

ఇక ఈ స్కూటర్ ప్రత్యేకతలు చూస్తే.. బ్లూటూట్‌ కనెక్టివిటీ, టెలిస్కోపిక్ సస్పెన్షన్‌, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లున్నాయి. 110సీసీ సామర్థ్యం కలిగిన ఈ స్కూటర్‌ ఇంజిన్‌ 7250 ఆర్‌ఎంపీ వద్ద 8బీహెచ్‌పీని, 5750 ఆర్‌ఎంపీ వద్ద 8.7ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ స్కూటర్‌ ఐ3ఎస్ టెక్నాలజీతో వస్తోంది. యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌ ఇచ్చారు. నారింజ, నలుపు, ఎరుపు, తెలుపు, నీలం రంగుల్లో స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక హంగులతో ఈ ద్విచక్రవాహనాన్ని మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. H-షేప్డ్‌ LED DRLs,ఎక్స్‌ షేప్డ్‌ టెయిల్‌ ల్యాంప్‌లతో ఈ స్కూటర్‌కు కొత్త హంగులు జోడించారు. దీనికి కార్నరింగ్‌ లైట్లను కూడా ఇచ్చారు. ఇందులో ప్రత్యేకంగా 12 అంగుళాలు కలిగిన అలాయ్‌వీల్స్.. ఇది 1300mm వీల్‌బేస్,  1843mm పొడవు, 717 mm వెడల్పు, 1188 mm ఎత్తు ఉంది.  X వేరియంట్‌కు మాత్రం 731 mm కలిగిన వెడల్పయిన బాడీని ఇచ్చారు.  ఇక ఇంజన్‌ విషయానికొస్తే 110 సీసీ.. సింగల్ సిలిండర్‌, ఎయిర్ కూల్డ్‌ మోటార్‌ ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హోండా యాక్టివా, టీవీఎస్‌ జుపిటర్‌లకు గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని