రిటైర‌య్యే నాటికి క‌నీసం రూ.4 కోట్లైనా ఉండాలంటే

యువ‌త ప‌ద‌వీవిర‌మ‌ణ చేసే నాటికి అప్ప‌టి ఖ‌ర్చుల‌కు అనుగుణంగా ప్ర‌ణాళిక వేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది​​​​​​...

Published : 18 Dec 2020 15:49 IST

యువ‌త ప‌ద‌వీవిర‌మ‌ణ చేసే నాటికి అప్ప‌టి ఖ‌ర్చుల‌కు అనుగుణంగా ప్ర‌ణాళిక వేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ప్ర‌భుత్వరంగ ఉద్యోగుల‌కు గ‌తంలో రిటైర్‌మెంట్ త‌రువాత జీవితానికి పెద్ద‌గా ప్ర‌ణాళిక వేయాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు. ఎందుకంటే ప్రతీ నెల వారికి పెన్ష‌న్ ఉండేది. కానీ ప్ర‌స్తుతం ఆ విధానం అమ‌లులో లేదు. ప్రైవేటురంగంలో ఉద్యోగం చేసే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. కాబ‌ట్టి ప‌ద‌వీవిర‌మ‌ణ ప్ర‌ణాళిక ప్ర‌స్తుత త‌రం వారికి చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్పాలి. గౌత‌మ్ వ‌య‌సు 30 ఏళ్లు. అత‌ని నెల జీతం రూ.50,000. అందులో పొదుపు రూ.20,000. నెల‌వారీ ఖ‌ర్చుల‌కు రూ.30,000 అవుతుంది. మ‌రో 30 ఏళ్ల త‌రువాత ప‌ద‌వీవిర‌మ‌ణ చేస్తారు. అప్ప‌టికి త‌న కుటుంబానికి నెల‌వారీ ఖ‌ర్చుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే డ‌బ్బును స‌మ‌కూర్చేందుకు ప్ర‌ణాళిక ద్వారా ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం. ప్ర‌స్తుతం గౌత‌మ్ త‌న కుటుంబ ఖ‌ర్చుల‌కు రూ.30 వేలు ఖ‌ర్చు చేస్తున్నారు. అది 30 సంవ‌త్స‌రాల త‌రువాత ఎంత అవుతుంది? ఆ మొత్తాన్ని ప్ర‌తీనెలా పొందాలంటే ఎంత మొత్తం ప‌ద‌వీవిర‌మ‌ణ నిధి అవ‌స‌రం ఉంటుంది? ఇవి గౌత‌మ్ ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు. ప్ర‌తీ నెలా సిప్ విధానంలో ఈక్విటీ,బ్యాలెన్సెడ్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి కొన‌సాగిస్తే గౌత‌మ్ త‌న ప‌ద‌వీవిర‌మ‌ణ నాటికి రూ. 4 కోట్లు పొంద‌వ‌చ్చు.కింది ప‌ట్టిక‌లో వివిధ రాబ‌డి అంచ‌నాల‌తో లెక్కేస్తే నెల‌వారీ సిప్ పెట్టుబ‌డి మారుతుంది.

RETIRE-PLAN.png

ప‌ట్టిక‌లో చూపిన విధంగా:

30 ఏళ్ల త‌రువాత గౌత‌మ్ త‌న అవ‌స‌రాల నిమిత్తం నెల‌కు రూ.1,72,305 ఖ‌ర్చు అవుతంది. ద్ర‌వ్యోల్బ‌ణం 6 శాతం చొప్పున లెక్కేస్తే ఇప్ప‌టి రూ. 30 వేలు ముప్పైళ్ల త‌రువాత రూ.1,72,305 ల‌క్ష‌లు అవుతంది. అంటే ఏడాదికి రూ.20,67,657 అవుతుంది. ఇత‌ర లైఫ్‌స్టైల్ సంబంధిత ఖ‌ర్చుల‌ను క‌లుపుకుని రూ.24 ల‌క్ష‌లు అవుతుంద‌ని లెక్కేద్దాం.

గౌత‌మ్ ప‌ద‌వీవిర‌మ‌ణ పొందిన త‌రువాత‌ ప్ర‌తీ నెల రూ.1,72,305 పొందాలంటే రూ. 4 కోట్ల ప‌ద‌వీవిర‌మ‌ణ నిధి అవ‌స‌ర‌మ‌వుతుంది. ఈ మొత్తాన్ని అత్యంత త‌క్కువ న‌ష్ట‌భ‌యం క‌లిగిన‌ లిక్విడ్ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తే 6 శాతం రాబ‌డి చొప్పున ఏడాదికి 24 ల‌క్ష‌లు గౌత‌మ్ పొంద‌వ‌చ్చు .

బీమా ఎంతుండాలి?

గౌత‌మ్ జీవిత బీమా ఎండోమెంట్ పాల‌సీ 25 ల‌క్ష‌ల‌కు ఉంద‌నుకుందాం. అనుకోని ప‌రిస్థితుల కార‌ణంగా ఏదైన జ‌రిగితే త‌న కుటుంబానికి రూ.25 ల‌క్ష‌లు , బోన‌స్ రూ. 10 ల‌క్ష‌లు మొత్తం 35 ల‌క్ష‌లు అందుతుంది. అయితే ఈ మొత్తం అత‌ని కుటుంబ అవ‌స‌రాల‌కు స‌రిపోతుందా? కాబ‌ట్టి గౌత‌మ్ త‌న ఎండోమెంట్ పాల‌సీల‌ను మూసివేసి ట‌ర్మ్ బీమా పాల‌సీని క‌నీసం రూ.2 కోట్ల‌కు తీసుకోవాలి. దీనికి ప్రీమియం కూడా చాలా త‌క్కువ‌గానే ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని