ఈ ఏడాది భారత వృద్ధి 12.5%

ఈ ఏడాది భారత వృద్ధి ఆకర్షణీయంగా 12.5 శాతం నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎమ్‌ఎఫ్‌) అంచనా వేస్తోంది. గతేడాది కరోనాలోనూ సానుకూల వృద్ధి సాధించిన ఏకైక దేశం చైనా కంటే ఈ వృద్ధి ఎక్కువ కావడం విశేషం. ప్రపంచ బ్యాంకుతో సమావేశానిక.........

Published : 07 Apr 2021 14:57 IST

చైనా కంటే ఎక్కువే ఇది
ఐఎమ్‌ఎఫ్‌ అంచనాలు

వాషింగ్టన్‌: ఈ ఏడాది భారత వృద్ధి ఆకర్షణీయంగా 12.5 శాతం నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎమ్‌ఎఫ్‌) అంచనా వేస్తోంది. గతేడాది కరోనాలోనూ సానుకూల వృద్ధి సాధించిన ఏకైక దేశం చైనా కంటే ఈ వృద్ధి ఎక్కువ కావడం విశేషం. ప్రపంచ బ్యాంకుతో సమావేశానికి ముందు వార్షిక ‘వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌’ అంచనాలను ఐఎమ్‌ఎఫ్‌ వెలువరచింది. ఆ అంచనాల ప్రకారం.. 
*2020లో రికార్డు స్థాయి క్షీణతను నమోదు చేసిన భారత్‌.. 2021లో మాత్రం 12.5 శాతం మేర రాణించవచ్చు. 2022లో 6.9 శాతం మేర వృద్ధి చెందొచ్చు. 
*2020లో 2.3 శాతం మేర వృద్ధి చెందిన చైనా ఈ ఏడాది 8.6 శాతం; వచ్చే ఏడాది 5.6 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేయొచ్చు. 
* అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ గతంలో అంచనా వేసినదాని కంటే మిన్నగా రాణిస్తుంది. ఈ ఏడాది 6 శాతం; వచ్చే ఏడాది 4.4 శాతం మేర వృద్ధి చెందొచ్చు. 2020లో ఇది 3.3 శాతం మేర క్షీణించిన సంగతి విదితమే. సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి. మరింత వేగంగా సవాళ్ల నుంచి బయటపడుతున్నాయి. 
*అక్టోబరు 2020 వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌(డబ్ల్యూఈఓ)లో ఐఎమ్‌ఎఫ్‌ అంచనా వేసిన దాని కంటే 2020లో 1.1 శాతం తక్కువగా అంతర్జాతీయ వృద్ధి క్షీణించింది. అదే సమయంలో 2021, 2022 అంచనాలను అక్టోబరుతో పోలిస్తే 0.8%; 0.2% చొప్పున ఐఎమ్‌ఎఫ్‌ పెంచినట్లయింది. కొన్ని పెద్ద దేశాల్లో అదనపు ద్రవ్యలభ్యత, ద్వితీయార్ధంలో టీకా ఆధారిత రికవరీ పుంజుకుంటుందన్న భావనల నేపథ్యంలో ఐఎమ్‌ఎఫ్‌ తన అంచనాలను సవరించింది. 
*‘కరోనాను ఇంకా ఓడించాల్సి ఉంది. చాలా దేశాల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆయా దేశాల్లో కరోనా తర్వాత రుణ స్థాయిలు పెరగడం; పర్యాటకం మీదే ఆధారపడడంతో టీకా కార్యక్రమానికి తగిన విధాన మద్దతు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాయ’ని వివరించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని