మందకొడిగా మార్కెట్‌ సూచీలు

దేశీయ మార్కెట్‌ సూచీలు గురువారం మందకొడిగా ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.46 సమయంలో సెన్సెక్స్‌ ఒక పాయింటు లాభంతో  51,705 వద్ద నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 15,219 వద్ద కొనసాగుతున్నాయి.

Updated : 18 Feb 2021 09:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్‌ సూచీలు గురువారం మందకొడిగా ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.46 సమయంలో సెన్సెక్స్‌ ఒక పాయింటు లాభంతో 51,705 వద్ద నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 15,219 వద్ద కొనసాగుతున్నాయి. సెంట్రల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, గుజరాత్‌ గ్యాస్‌, టీసీఎన్‌ఎస్‌ క్లోతింగ్‌, జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. గ్రేవెస్‌ కాటన్‌, ఇండియా గ్లెకోల్స్‌, స్నోమెన్‌ లాజిస్టిక్స్‌, నియోజన్‌ కెమికల్స్‌ నష్టాల్లో ఉన్నాయి. 

ఓఎన్‌జీసీ షేర్లు  3శాతానికిపైగా లాభపడ్డాయి. స్టేట్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ఫినాన్స్‌ షేర్లుకూడా సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అబుజాసిమెంట్స్‌, ఎన్కీవీల్స్‌, ఆర్‌సీఎల్‌ రీటైల్‌, ట్విన్‌స్టార్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించనున్నారు. 

ఇదీ చదవండి

ప్రై‘వేటు’పై విమర్శలొస్తున్నా పట్టుదల ఎందుకు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని