Gold Loans: బంగారంపై రుణాల‌కు రుణ సంస్థ‌లు విధించే వ‌డ్డీ రేట్లు

తాక‌ట్టు పెట్టిన బంగారానికి మార్కెట్ విలువ‌లో 75% వ‌ర‌కు రుణం అందించ‌బ‌డుతుంది.

Updated : 08 Dec 2021 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారంపై రుణం తీసుకోవ‌డం చాలా మందికి తెలిసిన విష‌య‌మే. చాలా సంవ‌త్స‌రాల క్రితమే బ్యాంకులు బంగారం త‌న‌ఖా పెట్టుకుని రుణాలు ఇచ్చినా.. త‌క్కువ స్థాయిలోనే ఈ రుణాలు అంద‌జేసేవి. అయితే, ప్రైవేట్ వ్య‌క్తులు, చిన్న వ్యాపారులు ఎక్కువ‌గా బంగారు త‌న‌ఖా రుణాలను అంద‌జేసేవారు. బ్యాంకులు క‌న్నా వీరే ఈ బంగారు త‌న‌ఖా రుణ వ్యాపారాన్ని ఎక్కువ‌గా చేసేవారు. అయితే వినియోగ‌దారులు అత్యంత గ్యారెంటీ ఆస్తి బంగారాన్ని త‌న‌ఖా పెడుతుండ‌టంతో బంగారంపై రుణాలు ఇవ్వ‌డానికి బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థలు అధికాస‌క్తిని చూపుతున్నాయి. బంగారు రుణాల‌కు త‌క్కువ డాక్యుమెంటేష‌న్ స‌రిపోవ‌డ‌మే గాక త్వ‌రితగతంగా కూడా రుణ మంజూరు అవుతుంది. అత్య‌వ‌స‌ర ఆర్థిక పరిస్థితుల్లో వినియోగ‌దారుల‌కు ఈ రుణం చాలా సౌక‌ర్యంగా ఉంటుంది. బ్యాంకుల్లో బంగారం త‌న‌ఖా పెట్టి రుణం తీసుకుంటే తీసుకున్న న‌గ‌దు ఉప‌యోగ‌ప‌డ‌డ‌మే కాకుండా, త‌న‌ఖా పెట్ట‌బ‌డిన‌ బంగారం అత్యంత భ‌ద్ర‌తంగా ఉంచుతారు.

తాక‌ట్టు పెట్టిన బంగారానికి మార్కెట్ విలువ‌లో 75% వ‌ర‌కు రుణం ఇస్తారు. బంగారం ధ‌ర‌లు త‌గ్గితే, మీరు పొందే రుణ మొత్తం కూడా త‌గ్గుతుంది. కాబ‌ట్టి బంగారు రుణాలను తీసుకునే ముందు బంగారం ధ‌ర‌ల‌ను చెక్ చేసుకోవ‌డం మంచిది. బంగారం ధ‌ర‌లు త‌గ్గితే, బ్యాంకు మ‌రింత బంగారాన్ని తాక‌ట్టు పెట్ట‌మ‌ని అడ‌గొచ్చు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల‌తో పాటు నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ)లు బంగారు రుణాల‌ను అందిస్తున్నాయి. ఇత‌ర రుణాల లాగానే మీ అవ‌స‌రాలు, రుణాన్ని తిరిగి తీర్చే సామ‌ర్థ్యానికి అనుగుణంగా రుణ మొత్తాన్ని నిర్ణ‌యించుకోవాలి. ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితికి బంగారు రుణం చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. అయితే రుణాన్ని స‌కాలంలో చెల్లించాలి. రుణ మొత్తం తీర్చ‌డానికి గ‌డువు అయిపోయినా కూడా తీర్చ‌లేక‌పోయి, డిఫాల్డ్ చెందితే మీ తాక‌ట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయ‌డం కూడా జ‌రుగుతుంది. అపుడు మీ విలువైన ఆస్తిని పోగొట్టుకుంటారు. బంగారు రుణాన్ని తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే, వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ-క్లోజ‌ర్ ఛార్జీలు ఎంత ఉంటాయి అనేది చూసుకోవాలి. కొన్ని ప్ర‌ముఖ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు ఆఫ‌ర్‌ల‌ను ప‌రిశీలించండి.

2 సంవ‌త్స‌రాల కాలానికి రూ. 2.50 ల‌క్ష‌ల రుణానికి సంబంధించి వ‌డ్డీ రేట్లు, ఈఎంఐ వివరాలు కింది పట్టికలో ఉన్నాయి.

గ‌మ‌నిక: ఈ వ‌డ్డీ రేట్లు న‌వంబ‌ర్ 30, 2021 నాటివి. రుణ సంస్థ‌లు ప్ర‌క‌టించిన అత్య‌ల్ప వ‌డ్డీ రేట్లు మాత్ర‌మే ఈ టేబుల్‌లో ఇచ్చాం. ఈఎమ్ఐలో ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలను కలపలేదు. మీ రుణ మొత్తం, లోన్‌-టు-వాల్యూ (ఎల్‌టీవీ) నిష్ప‌త్తి, మీరు ఎంచుకున్న రుణ సంస్థ, ఇత‌ర నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌పై ఆధార‌ప‌డి మీకు వ‌ర్తించే వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉండొచ్చు. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని