Section 80C: సెక్షన్‌ 80C లిమిట్‌ పెంచుతారా? ప్రభుత్వ సమాధానం ఇదే..

Income tax 80C limit: సెక్షన్‌ 80సి లిమిట్‌ పెంచాలని ట్యాక్స్‌పేయర్లు కోరుతున్నారు. అయితే, అలాంటి ప్రతిపాదనేదీ లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది.

Updated : 02 Aug 2023 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను చట్టం (Income Tax)లోని సెక్షన్‌ 80C (Section 80C) లిమిట్‌ పెంచాలని వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వివిధ పథకాల కింద 80C రూపంలో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే మినహాయింపులు పొందేందుకు వీలుంది. ఈ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందా? అని పార్లమెంట్‌లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని పేర్కొంది.

పన్ను చెల్లింపును సులభతరం చేసే ఉద్దేశంతో కొత్త పన్ను విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. అందుకే మినహాయింపులు తొలగించి, తక్కువ పన్ను రేట్లు ఉన్న కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. కాబట్టి సెక్షన్‌ 80C లిమిట్‌నను పెంచే ఉద్దేశమేదీ లేదని స్పష్టంచేశారు. అలాగే, చిన్న మొత్తాల పొదుపు పథకాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో రూ.74,937 కోట్లు సమకూరినట్లు మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

హార్లే ప్రియులకు హీరో షాక్‌.. X440 ధర పెంపు

సెక్షన్‌ 80C కింద గృహ రుణాలు, జీవిత బీమా పాలసీలతో పాటు పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చేసే 5 ఏళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి. ఒకవేళ పెట్టుబడుల పరిమితి రూ.1.50 లక్షలు దాటినా రూ.1.5 లక్షల వరకే మినహాయింపులకు అనుమతిస్తారు. అందుకే ఈ పరిమితిని పెంచాలని పలువురు కోరుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌కు ముందు నిర్వహించిన ప్రీ బడ్జెట్‌ సమావేశాల్లోనూ పలువురు 80సి పరిమితి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని