ఐపీఎల్‌: జియో అదిరిపోయే ఆఫర్లు

త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. జియో పోస్ట్‌పెయిడ్‌

Published : 08 Apr 2021 20:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌ ప్లాన్‌ అన్నీ ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించే సౌకర్యం కల్పిస్తుండగా, ప్రీపెయిడ్‌ ప్లాన్‌ వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కలిపి ఈ ప్లాన్‌ను అందుబాటులో ఉండనున్నాయి.

* జియో 401 ప్రీపెయిడ్‌ ప్లాన్‌: ఈ ప్లాన్‌ కింద రోజూ 3జీబీ హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. అంతేకాదు, డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు, 6జీబీ అదనపు డేటా లభిస్తుంది. కాలపరిమితి 28 రోజులు

*  జియో 598 ప్రీపెయిడ్‌ ప్లాన్‌: ఈ పథకం కింద రూ.598తో రీఛార్జ్‌ చేసుకుంటే, రోజూ 2జీబీ డేటాతో పాటు, ఉచిత అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా ఏడాది పాటు డిస్నీ + హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. ఈ పథకం కాల పరిమితి 56 రోజులు

* జియో 777 ప్రీపెయిడ్‌ ప్లాన్‌: ఈ ప్రీపెయిడ్‌ పథకం కింద రోజూ 1.5జీబీ డేటాతో పాటు, అపరిమితి కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు. ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా ఏడాది పాటు డిస్నీ + హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. ఈ పథకం కాల పరిమితి 84 రోజులు.

* జియో 2599 ప్రీపెయిడ్‌ ప్లాన్‌: ఇది వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌. ఏడాది పాటు జియో టు ఉచిత అపరిమిత కాల్స్‌తో పాటు రోజు 2జీబీ డేటా పొందవచ్చు. అదనంగా మరో 10జీబీ డేటా లభిస్తుంది. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది.

జియో ఫోన్‌ వినియోగదారులు జియో క్రికెట్‌యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా స్కోర్‌ అప్‌డేట్స్‌తో పాటు క్వి్జ్‌లో పాల్గొని బహుమతులు కూడా గెలుచుకోవచ్చని జియో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని