స్పెక్ట్రమ్‌ వేలానికి జియో రూ.10,000 కోట్ల డిపాజిట్‌

మార్చి 1 నుంచి మొదలయ్యే స్పెక్ట్రమ్‌ వేలానికి రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు మొత్తం రూ.13,475 కోట్ల నగదు డిపాజిట్‌(ఈఎమ్‌డీ)ను సమర్పించాయి. ఆ మేరకు టెలికాం

Published : 19 Feb 2021 01:20 IST

భారతీ, వొడాఫోన్‌లూ ఇచ్చాయ్‌

దిల్లీ: మార్చి 1 నుంచి మొదలయ్యే స్పెక్ట్రమ్‌ వేలానికి రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు మొత్తం రూ.13,475 కోట్ల నగదు డిపాజిట్‌(ఈఎమ్‌డీ)ను సమర్పించాయి. ఆ మేరకు టెలికాం విభాగం గురువారం సమాచారం ఇచ్చింది. వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రమ్‌ కొనుగోలు అర్హతకు చెల్లించాల్సిన మొత్తంలో ఈ ఈఎమ్‌డీ విలువ నాలుగో వంతుకు దగ్గరగా ఉంది. కాగా, జియో రూ.10,000 కోట్ల ఈఎమ్‌డీతో ప్రస్తుతానికి అగ్రస్థానంలో నిలిచింది. భారతీ రూ.3,000 కోట్లు; వొడాఫోన్‌ ఐడియా రూ.475 కోట్లు చొప్పున ఈఎమ్‌డీలను సమర్పించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని