Auto Sales: సెప్టెంబరులోనూ వాహన విక్రయాలకు చిప్‌ సెగ!

సెప్టెంబరులోనూ వాహన విక్రయాలకు చిప్‌సెట్‌ల కొరత వేధించింది. కొన్ని కంపెనీలు రాణించినప్పటికీ.. కీలక సంస్థల విక్రయాలు మాత్రం పడిపోయాయి....

Updated : 22 Aug 2022 16:21 IST

దిల్లీ: సెప్టెంబరులోనూ వాహన విక్రయాలకు చిప్‌సెట్‌ల కొరత వేధించింది. కొన్ని కంపెనీలు రాణించినప్పటికీ.. కీలక సంస్థల విక్రయాలు మాత్రం పడిపోయాయి. దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ(ఎంఎస్‌ఐ) వాహన విక్రయాల్లో 46% క్షీణత కనిపించింది. గత నెలలో అమ్మకాలు 86,380 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2020 సెప్టెంబరులో సంస్థ 1,60,442 వాహనాలు విక్రయించింది. ఎంఎస్‌ఐ దేశీయ విక్రయాలు 1,60,442 నుంచి ఏకంగా 54.9 శాతం తగ్గి 68,815కి పరిమితమయ్యాయి. చిన్న కార్లలో ఆల్టో, ఎస్‌-ప్రెసోల విక్రయాలు 68,815 నుంచి 68,815కు పడిపోయాయి. కాంపాక్ట్‌ కార్ల విభాగంలో స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ విక్రయాలు 75.19 శాతం తగ్గి 20,891కి తగ్గిపోయాయి. మధ్యస్థాయి సెడాన్‌ సియాజ్‌ అమ్మకాలు 36.04 శాతం పడిపోయాయి. వినియోగ వాహనాలైన ఎర్టిగా, ఎస్‌-క్రాస్‌, విటారా బ్రెజా, విక్రయాలు 22.11 శాతం తగ్గి 18,459కు చేరాయి. అయితే, ఎగుమతులు మాత్రం రెండింతలు పెరగడం విశేషం. గత ఏడాది ఇదే నెలలో 7,834 యూనిట్లు ఎగుమతి కాగా.. ఈసారి అవి 17,565 యూనిట్లకు పెరిగింది.

* ఇక మరో వాహన దిగ్గజం హ్యుందాయ్‌ అమ్మకాలు సైతం 59,913 నుంచి 24 శాతం తగ్గి 45,791 యూనిట్లకు పడిపోయాయి. టొయోటా కిర్లోస్కర్‌, నిస్సాన్‌, ఎంజీ మోటార్‌, స్కోడా ఆటో విక్రయాలు మాత్రం సెప్టెంబరు నెలలో పెరిగాయి.

* ద్విచక్ర వాహనాల్లో బజాజ్‌ ఆటో విక్రయాలు 16 శాతం తగ్గాయి. టీవీఎస్‌ మోటార్స్ అమ్మకాలు సైతం 06 శాతం పెరిగాయి. 

కంపెనీ               2021            2020             వృద్ధి/క్షీణత(%)

మారుతీ సుజుకీ       86,380           1,60,442            46.16

టొయోటా             9,284             8,116              14

నిస్సాన్‌               2,816              780              361

ఎంజీ మోటార్‌         3,241              2,537             28

స్కోడా ఆటో          3,027               1,312             230

హ్యుందాయ్‌         45,791              59,913            23.6

మహీంద్రా            28,112              35,920            21.73

ట్రాక్టర్లు..

ఎస్కార్ట్స్‌               8,816             11,851             25.6

మహీంద్రా              40,331            43,386              07

ద్విచక్రవాహనాలు..

బజాజ్‌ ఆటో            1,92,348         2,28,731              16

టీవీఎస్‌ మోటార్‌        3,32,511          3,13,332              06

వాణిజ్య వాహనాలు...

వీఈసీవీ                6,070              3,506             73.1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని