కేంద్ర బడ్జెట్‌ యాప్‌.. ఇవి తెలుసుకోండి

త్వరలో ప్రవేశ పెట్టబోయే కేంద్ర బడ్జెట్‌- 2021 ప్రతులను సామాన్యులకూ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. గతంలోనూ

Updated : 25 Jan 2021 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో ప్రవేశ పెట్టబోయే కేంద్ర బడ్జెట్‌- 2021 ప్రతులను సామాన్యులకూ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. గతంలోనూ బడ్జెట్‌ పత్రాలను వెబ్‌సైట్‌లో పొందే వీలున్నా.. దాన్ని మరింత సులభతరం చేస్తూ, మరిన్ని ఫీచర్లు జోడిస్తూ ఈ యాప్‌ను  తీసుకొచ్చారు. ఇటీవల హల్వా వేడుక సందర్భంగా ‘Union Budget Mobile App’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుదల చేశారు. నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) దీన్ని రూపొందించింది.

* బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి ప్రసంగం, వార్షిక ఆర్థిక నివేదిక, ఆర్థిక బిల్లు.. ఇలా 14 రకాల బడ్జెట్‌ పత్రాలను ఈ యాప్‌లో పొందొచ్చు.

* హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ పత్రాలు అందుబాటులో ఉంటాయి.

* మొబైల్‌లో బడ్జెట్‌ పత్రాలను వీక్షించడమే కాక.. డౌన్‌లోడ్‌ చేసుకునే వీలూ ఉంది. పత్రాలను ప్రింట్‌ చేసుకోవచ్చ కూడా.

* జూమ్‌ ఇన్‌, జూమ్‌ ఔట్‌ ఫీచర్ల ద్వారా సులువుగా చదువుకోవచ్చు. బడ్జెట్‌లో మనకు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్‌ చేసే వెసులుబాటూ కల్పించారు.

* బడ్జెట్‌లో భాగంగా ఉదహరించిన ఇతర లింకులనూ యాక్సెస్‌ చేయొచ్చు.

* ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ఈ యాప్‌ను బడ్జెట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

* ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత ఈ యాప్‌లో బడ్జెట్‌ పత్రాలు అందుబాటులోకి వస్తాయి.

ఇవీ చదవండి..
బడ్జెట్‌ 2021: నిర్మలమ్మ ముందున్న సవాళ్లు!
ప్రపంచమంతా ఓవైపు.. భారత్‌, చైనా మరోవైపు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని