LIC HFL: ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ గృహరుణ వడ్డీరేట్ల పెంపు

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిడెట్‌ (LIC HFL) గృహరుణాల వడ్డీరేట్లను పెంచింది....

Published : 13 May 2022 15:24 IST

ముంబయి: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిడెట్‌ (LIC HFL) గృహరుణాల వడ్డీరేట్లను పెంచింది. సిబిల్‌ స్కోర్‌ (CIBIL Score) ఆధారంగా పెంపు 20-40 బేసిస్‌ పాయింట్ల వరకు ఉంది. కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. 

సిబిల్‌ స్కోరు 700 అంతకంటే ఎక్కువ ఉన్నవారికి వడ్డీరేట్లను 20 బేసిస్‌ పాయింట్లు (0.2%) పెంచి 6.9 శాతానికి చేర్చింది. స్కోర్‌ అంతకంటే తక్కువ ఉన్నవారు 25 పాయింట్ల (0.25%) పెంపును చవిచూడాల్సి ఉంది. మరోవైపు కొత్తగా రుణం తీసుకునేవారికి వడ్డీరేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచారు.

అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ఇటీవల రెపోరేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా పలు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు కూడా రుణ వడ్డీరేట్లను పెంచుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని