Stock market: ఆరంభ లాభాల ఆవిరి.. ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock market closing bell: మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.

Updated : 05 May 2022 16:02 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆర్‌బీఐ ఇచ్చిన షాక్‌తో బుధవారం నష్టాల్లో ముగిసిన సూచీలు గురువారం నాటి ట్రేడింగ్‌లో కోలుకున్నాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచినప్పటికీ.. దూకుడు ఉండబోదన్న సంకేతాలతో ఆ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. దీని ప్రభావంతో ఆసియా మార్కెట్లు సహా దేశీయ మార్కెట్లలో సైతం కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. అయితే, మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.

ఉదయం 56,146 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ తర్వాత బాగా పుంజుకుంది. ఒక దశలో 56,500 స్థాయిని దాటింది. మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగిన సూచీ.. అమ్మకాల ఒత్తిడితో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఇంట్రాడే డేలో గరిష్ఠాలతో పోలిస్తే 800 పాయింట్లు సూచీ కోల్పోయింది. చివరికి 33.20 పాయింట్ల లాభంతో 55,702.23  వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 5.10 పాయింట్ల లాభంతో 16,682.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో టెక్‌ మహీంద్రా, హీరో మోటోకార్ప్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో షేర్లు రాణించాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌, బ్రిటానియా, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. పవర్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఐటీ రంగాల షేర్లు 1-2 శాతం లాభపడగా.. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లు 0.5-1.5 శాతం మేర నష్టపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని