Maruti Suzuki Ertiga: సరికొత్తగా మారుతీ ఎర్టిగా @ ₹8.35 లక్షలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తమ మారుతీ ఎర్టిగా మల్టిపర్పస్‌ వెహికల్‌ను మరింత కొత్తగా తీర్చిదిద్ది శుక్రవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది....

Published : 15 Apr 2022 15:26 IST

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా తమ మారుతీ ఎర్టిగా (Ertiga) మల్టిపర్పస్‌ వెహికల్‌ (MPV)ను మరింత కొత్తగా తీర్చిదిద్ది శుక్రవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధరల శ్రేణి రూ.8.35-12.79 లక్షలు (ఎక్స్‌షోరూం).

మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తోన్న ఈ కారు 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తోంది. దీంట్లోనే సీఎన్‌జీ (CNG) ట్రిమ్‌లను కూడా విడుదల చేసింది. పదేళ్ల క్రితం తొలిసారి మార్కెట్‌లోకి వచ్చిన ఎర్టిగా విక్రయాల్లో ఏటా 4.7 శాతం వృద్ధి నమోదైందని సంస్థ ఎండీ, సీఈఓ హిసాషి టకూటీ తెలిపారు. కొత్తగా వచ్చిన తాజా ఎర్టిగాలో ఇంజిన్‌తో పాటు ట్రాన్స్‌మిషన్‌లో మార్పులు చేసినట్లు వెల్లడించారు.

పెట్రోల్‌, సీఎన్‌జీ ఆప్షన్లతో అందుబాటులో ఉన్న ఎర్టిగా పెట్రోల్‌తో 20.51 కి.మీ/లీ, సీఎన్‌జీతో 26.11 కి.మీ/కే.జీ మైలేజీని అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. క్రూజ్‌ కంట్రోల్‌, ‘ఫాలో మీ హోం’ ఫంక్షనాలిటీతో కూడిన ఆటో హెడ్‌ల్యాంప్స్‌, సీఎన్‌జీ వెర్షన్‌కు ప్రత్యేకమైన స్పీడోమీటర్‌ వంటి కొత్త ఫీచర్లను జత చేశారు. పెట్రోల్‌ వెర్షన్‌కు రూ.18,000, సీఎన్‌జీకి రూ.22,400 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తోనూ మారుతీ సుజుకీ ఎర్టిగాను సొంతం చేసుకోచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని