Microsoft India: మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ రాజీనామా

మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఇండియా ప్రెసిడెంట్‌ పదవికి అనంత్‌ మహేశ్వరి (Anant Maheshwari) రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త ప్రెసిడెంట్‌గా పునీత్‌ చందోక్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. 

Published : 07 Jul 2023 21:18 IST

దిల్లీ: మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి (Anant Maheshwari) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ధ్రువీకరిస్తూ మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటన చేసింది. ‘‘అనంత్‌ మహేశ్వరి మైక్రోసాఫ్ట్ నుంచి బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. భారత్‌లో సంస్థ వ్యాపారాభివృద్ధికి ఆయన అందించిన సేవలకు ధన్యవాదాలు. ఆయన భవిష్యత్తు ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాం’’ అని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. 

ఈ నేపథ్యంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (COO) ఐరినా ఘోస్‌ను మైక్రోసాఫ్ట్‌ ఇండియా విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శశి శ్రీధరన్‌కు ఉన్నతస్థాయి బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించకముందు అనంత్‌ మహేశ్వరి హనీవెల్‌ ఇండియా ప్రెసిడెంట్‌గా, మెక్‌కిన్సే అండ్‌ కంపెనీ ఎంగేజ్‌మెట్ మేనేజర్‌గా పనిచేశారు. 2016లో ఆయన మైక్రోసాఫ్ట్‌లో చేరారు. మరోవైపు మైక్రోసాఫ్ట్‌ ఇండియా నూతన ప్రెసిడెంట్‌గా పునీత్‌ చందోక్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అలాగే, మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ డైరెక్టర్‌ నవ్‌తేజ్‌ బాల్‌ను మైక్రోసాఫ్ట్‌ సీవోవోగా నియమించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని