నెల‌వారీ రాబ‌డికి ఫిక్సిడ్ డిపాజిట్ కంటే మేలైన మార్గాలు

ప్ర‌తి వ్య‌క్తికి జీవిత‌లో మూడు-నాలుగు అతిపెద్ద ఆర్థిక ల‌క్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాల‌ను చేరుకునేందుకు 20 నుంచి 35 సంవ‌త్స‌రాల వ‌ర‌కు పెట్టుబ‌డులు కొన‌సాగించవ‌ల‌సి రావ‌చ్చు.......

Published : 18 Dec 2020 12:57 IST

క్ర‌మానుగుతంగా ఆదాయాన్ని పొందే మార్గాన్ని ఎంచుకుంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు

ప్ర‌తి వ్య‌క్తికి జీవిత‌లో మూడు-నాలుగు అతిపెద్ద ఆర్థిక ల‌క్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాల‌ను చేరుకునేందుకు 20 నుంచి 35 సంవ‌త్స‌రాల వ‌ర‌కు పెట్టుబ‌డులు కొన‌సాగించవ‌ల‌సి రావ‌చ్చు. ముఖ్యంగా ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం జీవితం గ‌డ‌ప‌డానికి భ‌విష్య‌త్తు ద్రవ్యోల్బ‌ణ ప్ర‌భావాల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని పెట్టుబ‌డులు చేయ‌డంతో పాటు, అవి నెల‌వారీగా న‌గ‌దు ల‌భ్య‌తను కూడా క‌ల్పించాలి. ఒక వేళ మీరు ప్ర‌భుత్వోద్యోగి కాన‌ప్పుడు మీకు పింఛ‌ను రూపంలో డబ్బు అందదు. ప‌దవీ విర‌మ‌ణ అనంత‌రం ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డిపేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు? దీనికి మంచి ప్రత్యామ్నాయం మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోని సిస్టమాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ ప‌థ‌కాలు. మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల నుంచి స్థిరమైన సొమ్మును ఒక క్ర‌మ‌మైన వ్య‌వ‌ధిలో తీసుకోవ‌డాన్నే సిస్ట‌మెటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్(ఎస్‌డ‌బ్ల్యూపీ) అంటారు. ఇక్క‌డ క్ర‌మ‌మైన వ్య‌వ‌ధి నెల‌, మూడు నెల‌లు, ఆరు నెల‌లు లేదా ఏడాది కావ‌చ్చు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన‌వారికి త‌మ మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల నుంచి నెల నెలా ఆదాయం రూపంలో పొందాలంటే ఈ సిస్ట‌మెటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ ఎంతో అనుకూల‌మైన‌ది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో స్థిర ఆదాయం:

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో స్థిర ఆదాయం, క‌చ్చిత‌మైన రాబ‌డి ల‌భిస్తుంది. అయితే డెట్ ఫండ్ల‌లో, ఫండ్ పనితీరునుబ‌ట్టి లాభం ఉంటుంది. అయితే ఇవి స్థిర‌మైన రాబ‌డి ఇవ్వ‌న‌ప్ప‌టికీ సిస్ట‌మెటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్(ఎస్‌డ‌బ్ల్యూపీ)తో నెల‌వారిగా క‌చ్చిత‌మైన ఆదాయం పొంద‌వ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు ఐదేళ్ల క్రితం ఫిబ్ర‌వ‌రి 2013 లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశార‌నుకుందాం. అప్పుడు బ్యాంకు వ‌డ్డీ రేట్లు అధికంగా 9 శాతం ఉన్నాయి. 5 ల‌క్ష‌ల డిప‌పాజిట్‌కు 9 శాతం అంటే నెల‌కు రూ.3,772 వ‌డ్డీ వ‌స్తుంది. ఇదే ఆదాయాన్ని 5 సంవ‌త్స‌రాల క్రితం 5 ల‌క్ష‌ల ఎఫ్‌డీ చేసార‌నుకుంటే 9 శాతం వ‌డ్డీ నెకు రూ.3,722. ఇదే ఆదాయ‌న్ని ఎస్‌డ‌బ్ల్యూపీలో నెల‌వారిగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

MF-PROFITS.png

ప‌న్ను విధానం:

ఎస్‌డ‌బ్ల్యూపీలో చెల్లించిన ప‌న్నుఎఫ్‌డీలో చెల్లించిన 10 శాతం ప‌న్నుతో స‌మానం. ఈ విధంగా చూసుకుంటే డెట్ ఫండ్ల‌లో మేలైన రాబ‌డి పొంద‌వ‌చ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల లో వ‌చ్చే ఆదాయం వ్య‌క్తి ఏ ప‌న్ను శ్లాబులోకి వ‌స్తారో, దానిపై ఆధార‌ప‌డి ప‌న్ను ఉంటుంది. డెట్ ఫండ్ల‌లో ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో ప‌న్ను విధిస్తారు. అదేవిధంగా ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిన మ‌రో విష‌యం ఏంటంటే పెట్టుబ‌డిపై వ‌చ్చిన లాభాల‌పై మాత్ర‌మే ప‌న్ను ఉంటుంది. పెట్టుబ‌డి కాల‌ప‌రిమితి త‌క్కువ‌గా ఉంటే షార్ట్ ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్స్ ట్యాక్స్ ప‌డుతుంది. అదే దీర్ఘకాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే ఇండెక్సేష‌న్ ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. అప్పుడు ఎక్కువ రాబ‌డి పొంద‌వ‌చ్చు.

త‌క్కువ శ్లాబులోకి వ‌చ్చే వారికంటే ఎక్కువ‌గా 30 శాతం శ్లాబులోకి వ‌చ్చేవారికి ఎస్‌డ‌బ్ల్యూపీ చాలా మంచి ఆప్ష‌న్. ఎందుకంటే మార్కెట్ ఒడుదొడుకుల‌ను ఎదుర్కొని మంచి రాబ‌డి పొందుతుంది. అప్పుడు రాబ‌డిపైనే ప‌న్ను ఉంటుంది. త‌క్కువ శ్లాబుల వారికి దాదాపు ఎఫ్‌డీల మాదిరిగానే రాబ‌డి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇక్క‌డ కూడా ఎస్‌డ‌బ్ల్యూపీలోనే ఎక్కువ లాభం ఉండొచ్చు.

రీఇన్వెస్ట్‌మెంట్ రిస్క్:

బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను ఎప్పుడూ మారుస్తుంటాయి. ఎఫ్‌డీల‌పై 9 శాతం వ‌డ్డీ అనేది గత ద‌శాబ్ద కాలంలోనే అత్య‌ధికం. అయితే వ‌డ్డీ 6.25-7 శాతం ఉన్న‌ప్పుడు భవిష్య‌త్తులో వ‌డ్డీ రేట్ల పెరిగినా మీకు ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఒక‌వేళ మీరు ఒక సంవ‌త్స‌రానికి లేదా మూడేళ్ల‌కి ఎఫ్‌డీ చేస్తే, త‌ర్వాత రినీవ‌ల్ చేసుకుంటే ప్ర‌స్తుతం ఉన్న వ‌డ్డీ రేట్ల‌కు, పాత రేట్ల‌క చాలా తేడా ఉండొచ్చు.

ఎఫ్‌డీల మాదిరిగానే ఎస్‌డ‌బ్ల్యూపీల‌ను కూడా సుల‌భంగా ప్రారంభించ‌వ‌చ్చు. వ‌డ్డీ రేట్లు కూడా పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఇక్క‌డ ఎస్‌డ‌బ్ల్యూపీ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఏంటంటే …

  1. సీనియ‌ర్ సిటిజ‌న్లు మొద‌ట పోస్టాఫీస్ సీనియ‌ర్ సిటిజ‌న్ స్కీమ్ ఎంచుకొని అందులో ఎస్‌డ‌బ్ల్యూపీ ఆప్ష‌న్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎఫ్‌డీల కంటే పోస్టాఫీస్ సీనియ‌ర్ సిటిజ‌న్ స్కీమ్‌లో ఎక్కువ వ‌డ్డీ ల‌భిస్తుంది.

  2. మీ పెట్టుబ‌డి నుంచి స‌త్వ‌ర ఆదాయం పొందాల‌నుకుంటే లిక్విడ్, అల్ర్టా షార్ట్, షార్ట్ ట‌ర్మ్ డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు అయితే ఎస్‌డ‌బ్ల్యూపీ ఎంచుకుంటే మార్కెట్ ఒడుదొడుకుల‌ను త‌ట్టుకొని మంచి లాభాల‌ను అందిస్తాయి.

  3. ఎక్కువ‌మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటే కొంత స్వ‌ల్ప కాలిక డెట్ ఫండ్ల‌లో పెట్ట‌డం మంచిది. లాంగ్ ట‌ర్మ్ డెట్ ఫండ్ల‌లో రెండు-మూడేళ్ల త‌ర్వాత విత్‌డ్రా ప్లాన్ ఎంచుకోవాలి ఎందుకంటే అప్ప‌టికి మార్కెట్ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకొని వృద్ధి చెందేందుకు అవ‌కాశం ఉంటుంది.

  4. నెల‌వారిగా ఆదాయం వ‌చ్చేలా ఈ ప‌ద్ధ‌తిని ఎంచుకోవ‌డం మంచిది. మీ పెట్టుబ‌డిని దీర్ఘ‌కాలం కొన‌సాగించాల‌నుకుంటే మీ వార్షిక ఉప‌సంహ‌ర‌ణ రేటు, మీ దీర్ఘ‌కాలిక రాబ‌డి కంటే త‌క్కువ‌గా ఉండాలి. ఉదాహర‌ణ‌కు మీ ఫండ్‌పై ఏడాది గ‌త ఐదేళ్ల నుంచి 7.5 శాతం రాబ‌డి వ‌స్తున్న‌ట్ల‌యితే, పెట్టుబ‌డి నుంచి సంవ‌త్స‌రానికి 6.5 నంచి 7 శాతం వ‌ర‌కు విత్ డ్రా చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని