Netflix: పాస్‌వర్డ్ షేరింగ్ ఇకపై కుదరదు: నెట్‌ఫ్లిక్స్

Netflix: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్ విధానాన్ని భారత్‌లో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ విషయంపై వినియోగదారులకు మెయిల్స్ పంపింది.

Updated : 20 Jul 2023 12:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) పాస్‌వర్డ్‌ షేరింగ్‌ విధానాన్ని భారత్‌లో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్‌ చందా తీసుకుంటారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై యాక్సెస్‌ పొందగలరని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్‌ తన యూజర్లకు మెయిల్స్ పంపింది. అందులో నెట్‌ఫ్లిక్స్ ఖాతా తీసుకున్న వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై ఓటీటీ సేవలు వినియోగించుకోగలుగుతారని స్పష్టంచేసింది.

సహజవాయువు 14 ఏళ్ల పాటు దిగుమతి

మా కస్టమర్ల అభిరుచి, వారి సంతృప్తి మేరకే పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి టీవీషోలు, కొత్త సినిమాలను కొనుగోలు చేస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ వివరించింది. అయితే, చందాదారుల కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ప్రయాణ సమయంలో కూడా ఓటీటీ సదుపాయం పొందవచ్చని తెలిపింది. ప్రొఫైల్‌ను బదిలీ చేయటం, మేనేజ్‌ యాక్సెస్ అండ్ డివైజస్ వంటి కొత్త ఫీచర్ల సాయంతో ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఈ సదుపాయాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ ఓటీటీ దిగ్గజం తన ఫ్లాట్‌ఫాం ద్వారా పంచుకుంది.

చందాదారుల సంఖ్య పెరిగింది..

  • పాస్‌వర్డ్ షేరింగ్‌ తీసుకు వచ్చిన నేపథ్యంలో దాదాపు 60 లక్షల మంది కొత్త చందాదారులు చేరినట్లు నెట్‌ఫ్లిక్స్ బుధవారం తెలిపింది. నటీనటుల సమ్మె యూఎస్‌ వినోద పరిశ్రమను తాకటంతో సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో మొత్తం 23కోట్ల 80లక్షల సబ్‌స్క్రైబర్లుతో 1.5 బిలియన్ల లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది.
  •  నెట్‌ఫ్లిక్స్‌ అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్టేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్‌తో పాటు 100కు పైగా దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను భవిష్యత్తులో అంగీకరించమని మే నెలలోనే ప్రకటించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని అమలు చేసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని