OnePlus Open: వన్‌ప్లస్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ @ ₹1.40 లక్షలు.. ఫీచర్లివే

OnePlus Open: వన్‌ప్లస్‌ తమ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ను విడుదల చేసింది. కెమెరాతో పాటు ఇతర ఫీచర్లు టెక్‌ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

Updated : 20 Oct 2023 13:30 IST

OnePlus Open | ఇంటర్నెట్‌ డెస్క్‌: వనప్లస్‌ ఓపెన్‌ (OnePlus Open) భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కంపెనీ నుంచి వచ్చిన తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ఇదే. ఈ ఫోన్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో వస్తోంది. లోపలి భాగంలో 7.82 అంగుళాల స్క్రీన్‌ను ఇచ్చారు. ఇతర ఫీచర్లు, ధరల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

వన్‌ప్లస్‌ ఓపెన్‌ ధర (OnePlus Open Price)..

వన్‌ప్లస్‌ ఓపెన్‌ (OnePlus Open) 16జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర భారత్‌లో రూ.1,39,999. ఎమరాల్డ్‌ డెస్క్‌, వాయేజర్‌ బ్లాక్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ సహా దేశవ్యాప్తంగా అన్ని రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ను విక్రయానికి ఉంచనున్నారు. ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 27 నుంచి విక్రయానికి వస్తున్నాయి. ఎంపిక చేసిన ఫోన్లపై రూ.8,000 వరకు ఎక్స్ఛేంజ్‌ రాయితీ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డు, వన్‌కార్డ్‌ ద్వారా మరో రూ.5,000 డిస్కౌంట్‌ కూడా లభిస్తుందని కంపెనీ తెలిపింది.

వన్‌ప్లస్‌ ఓపెన్‌ స్పెసిఫికేషన్లు (OnePlus Open Specifications)..

వన్‌ప్లస్‌ ఓపెన్‌ (OnePlus Open) డ్యుయల్‌ సిమ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్ఓస్‌ 13.2తో వస్తోంది. లోపలి భాగంలో 7.82 అంగుళాల (2,268x2,440 pixels) 2కే ఫ్లెక్సీ- ఫ్లుయిడ్‌ ఎల్‌టీపీఓ 3.0 అమోలెడ్‌ స్క్రీన్‌ను ఇచ్చారు. ఈ తెర 1-120Hz డైనమిక్‌ రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ రెస్పాన్స్‌ రేట్‌, 2,800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. తెరపై అల్ట్రా థిన్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు వెలుపలి భాగంలో 6.31 అంగుళాల (1,116x2,484 pixels) 2కే ఎల్‌టీపీఓ 3.0 సూపర్‌ ఫ్లుయిడ్‌ అమోలెడ్‌ స్క్రీన్‌ను ఇస్తున్నారు. ఈ తెర 10-120Hz డైనమిక్‌ రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ రెస్పాన్స్‌ రేట్‌, 2,800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.

వన్‌ప్లస్‌ ఓపెన్‌ (OnePlus Open)లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌ను అమర్చారు. వెనుకభాగంలో మూడు కెమెరాలతో కూడిన సెటప్‌ ఉంది. 48 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరాతో పాటు 1/1.43 అంగుళాల సోనీ LYT-T808 సీఎంఓఎస్‌ సెన్సార్‌, f/1.7 aperture ఉంది. 64 మెగాపిక్సెల్‌ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. వీటితో పాటు సెల్ఫీల కోసం లోపలి స్క్రీన్‌పై 20 మెగాపిక్సెల్‌, బయటి స్క్రీన్‌పై 32 మెగాపిక్సెల్‌ కెమెరాలు ఉన్నాయి. 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్‌ 5.3, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, GLONASS, గెలీలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌, యూఎస్‌బీ 3.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్‌, గైరోస్కోప్‌, ప్రాగ్జిమిటీ సెన్సర్‌, సెన్సర్‌ కోర్‌, ఈ-కంపాస్‌, ఫ్లిక్‌ డిటెక్ట్‌ సెన్సర్‌, అండర్‌ స్క్రీన్‌ యాంబియెంట్‌ లైట్‌ సెన్సర్‌ వంటి సెన్సర్లు ఉన్నాయి. 67W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌తో డ్యుయల్‌ సెల్‌ 4,800mAh బ్యాటరీ ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని