Oppo A78: మెరుగైన ఫీచర్లతో ఒప్పో A78.. కాకపోతే 4జీ

ఒప్పో కంపెనీ ఏ78 పేరిట కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. దీని ధరను రూ.17,499గా నిర్ణయించింది. గ్రీన్‌, బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభ్యమవుతుంది.

Published : 01 Aug 2023 19:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో (Oppo) ఏ సిరీస్‌లో ఏ78 4జీ (Oppo A78 4g) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఏ78 పేరుతో గతంలో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చిన ఆ సంస్థ.. తాజాగా 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 4జీ అయినా పర్వాలేదు అనుకునే వారు ఈ ఫోన్‌ పరిశీలించొచ్చు. 

₹ 11 వేలకే రెడ్‌మీ 5జీ ఫోన్.. ఫీచర్లివే

ఒప్పో ఏ79 సింగిల్‌ వేరియంట్లో వస్తోంది. 8జీబీ+128జీబీ స్టోరేజీతో వస్తోంది. దీని ధరను కంపెనీ రూ.17,499గా నిర్ణయించింది. ఆక్వా గ్రీన్‌, మిస్త్‌ బ్లాక్‌ రంగుల్లో లభ్యమవుతుంది. ఒప్పో ఆన్‌లైన్‌ స్టోర్‌ లేదా ఫ్లిప్‌కార్ట్‌, రిటైల్‌ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. ఇది ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 13.1తో వస్తోంది. 6.42 అంగుళాల ఫుల్‌ హెచ్‌ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ను వినియోగించారు. వెనుక వైపు 50 ఎంపీ కెమెరాతో పాటు 2 ఎంపీ డెప్త్‌ కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అమర్చారు. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటివి ఉన్నాయి. 67W సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని