PNB lending rate: పీఎన్‌బీ రుణ రేట్లలో 0.15% పెంపు

ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ‘నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు’ (ఎంసీఎల్‌ఆర్‌)ను అన్ని కాలావధి రుణాలకు 15 బేసిస్‌ పాయింట్లు (0.15%) పెంచింది....

Published : 01 Jun 2022 15:17 IST

దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) ‘నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు’ (MCLR)ను అన్ని కాలావధి రుణాలకు 15 బేసిస్‌ పాయింట్లు (0.15%) పెంచింది. దీంతో నెలవారీ వాయిదా (EMI)ల మొత్తం పెరగనుంది. పెంచిన రేట్లు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. రిజర్వు బ్యాంకు రెపో రేటును మే నెలలో 40 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీఎన్‌బీ రుణ రేట్లను సవరించింది. దీంతో ఏడాది కావావధి కలిగిన రుణ రేట్లు ఇకపై 7.25-7.40% మధ్య ఉండనున్నాయి. మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 7.70 శాతానికి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని