Rainbow Childrens Medicare IPO: ప్రారంభమైన రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ ఐపీఓ

‘రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌’ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభమైంది. ఏప్రిల్‌ 29 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు.....

Updated : 27 Apr 2022 10:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌’ పబ్లిక్ ఇష్యూ (Rainbow Childrens Medicare IPO)  నేడు ప్రారంభమైంది. ఏప్రిల్‌ 29 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. రూ.1580 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓకి వచ్చింది. కొత్తగా రూ.280 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయానికి అందుబాటులో ఉంచారు. రూ.1300.8 కోట్లు విలువ చేసే మరో 2.4 కోట్ల షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఉన్నాయి. మంగళవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.470 కోట్లు సమీకరించారు.

ఐపీఓ కీలక వివరాలు..

ఐపీఓ ప్రారంభ తేదీ : ఏప్రిల్‌ 27, 2022

ఐపీఓ ముగింపు తేదీ : ఏప్రిల్‌ 29, 2022

బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ : మే 5, 2022

రీఫండ్‌ తేదీ : మే 6, 2022

డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ : మే 9, 2022

స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్ల నమోదు : మే 10, 2022

ముఖ విలువ : ఒక్కో ఈక్విటీ షేరు రూ.10

ఐపీఓ ధరల శ్రేణి : ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.516-542

లాట్‌ సైజు : 27 షేర్లు

కనీసం ఆర్డరు చేయాల్సిన షేర్లు : ఒక లాట్‌ (27 షేర్లు)

గరిష్ఠంగా ఆర్డరు చేయాల్సిన షేర్లు : 13 లాట్లు (351 షేర్లు)

వివిధ విభాగాలకు కేటాయించిన షేర్లు

రిటైల్‌ ఇన్వెస్టర్లు : 35 శాతం

క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ బయ్యర్లు : 50 శాతం

నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు : 15 శాతం

సంస్థ వివరాలు..

చిన్న పిల్లలు, ప్రసూతి, గైనకాలజీకి సంబంధించిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్ (Rainbow Childrens Medicare) నిర్వహిస్తోంది. మొత్తం ఆరు పట్టణాల్లో 14 ఆసుపత్రులు, మూడు క్లినిక్‌లు ఉన్నాయి. మొత్తం 1,500 పడకల సామర్థ్యం ఉంది. 602 మంది ఫుల్‌ టైం, 1686 మంది పార్ట్‌టైం/విజిటింగ్‌ వైద్యులు ఉన్నారు. గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ రూ.729 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. నికర లాభం రూ.39.5 కోట్లుగా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని