IPO: పబ్లిక్‌ ఇష్యూకి సాహ్‌ పాలిమర్స్‌ దరఖాస్తు

 సాహ్‌ పాలిమర్స్‌ లిమిటెడ్‌ త్వరలో ఐపీఓకి రానుంది. ఈ మేరకు శుక్రవారం మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది....

Published : 22 Apr 2022 13:56 IST

దిల్లీ: సాహ్‌ పాలిమర్స్‌ లిమిటెడ్‌ త్వరలో ఐపీఓకి రానుంది. ఈ మేరకు శుక్రవారం మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. పబ్లిక్‌ ఇష్యూలో పూర్తిగా తాజా షేర్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 1.02 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. సమీకరించిన నిధులతో ‘ప్లెక్సిబుల్‌ ఇంటర్నీడియెట్‌ బల్క్‌ కంటెయినర్స్‌’ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించనున్నారు. కొత్త ప్రాజెక్టులకు కావాల్సిన మూలధనాన్ని సమకూర్చుకోనున్నారు. కొంత మొత్తాన్ని రుణ చెల్లింపులకు కేటాయించనున్నారు.

ఉదయ్‌పూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న సాహ్‌ పాలిమర్స్‌.. పాలీప్రొపిలీన్‌, హై డెన్సిటీ పాలీఎథిలీన్‌ సంచులతో పాటు పలు పాలిమర్‌ వస్తువులను ఉత్పత్తి చేసి విక్రయిస్తుంటుంది. వ్యవసాయ, క్రిమిసంహారక, బేసిక్‌ డ్రగ్స్‌, సిమెంట్‌, కెమికల్స్‌, ఎరువులు, ఆహార ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్‌, సిరామిక్స్‌, స్టీల్‌ వంటి పరిశ్రమలకు కావాల్సిన ప్యాకేజింగ్‌ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 12.16 శాతం పెరిగి రూ.55.07 కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని