Samsung Galaxy: శాంసంగ్‌ ఎస్‌23పై ₹15వేల డిస్కౌంట్‌..!

Samsung Galaxy: శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌ లాంచ్‌కి సిద్ధంగా ఉన్న వేళ ఎస్‌23 ధరలు తగ్గాయి. మునుపెన్నడూ లేని తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి.

Published : 07 Jan 2024 17:09 IST

Samsung Phones Price drop | టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంసంగ్‌ (Samsung) అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ రెండు వారాల్లో (జనవరి 17) ప్రారంభం కానుంది. తన ఎస్‌24 సిరీస్‌ ఫోన్లను ఈ సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ లాంచ్‌ కాకముందే శాంసంగ్‌ తన పాత సిరీస్ ఎస్‌23 మోడల్‌ ధరల్ని తగ్గించింది.

గెలాక్సీ ఎస్‌23 (Galaxy S23) 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.74,999కాగా.. రూ.10వేల డిస్కౌంట్‌తో రూ.64,999కే అందిస్తోంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.79,999గా పేర్కొనగా.. ప్రస్తుతం రూ.69,999కే విక్రయిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.  ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13తో కూడిన వన్‌యూఐ 5.1తో తీసుకొచ్చారు. 50 ఎంపీ ప్రధాన కెమెరా, ముందు వైపు 12 ఎంపీ కెమెరా, 3900mAh బ్యాటరీ అమర్చారు.

భారత్‌లో క్వాల్‌కామ్‌ మరో రూ.177 కోట్ల పెట్టుబడులు

గెలాక్సీ ఎస్‌23 ప్లస్‌ (Galaxy S23+) 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ.94,999గా కంపెనీ పేర్కొనగా.. తగ్గింపుతో రూ.84,999కే అందిస్తోంది. ఇక 8జీబీ+512 జీబీ వేరియంట్‌ మార్కెట్‌ ధర రూ.1,04,999కాగా.. రూ.94,999కే కొనుగోలు చేయొచ్చని శాంసంగ్‌ పేర్కొంది. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌, 50 ఎంపీ ప్రధాన కెమెరా, ముందు వైపు 12 ఎంపీ కెమెరా, 4700mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

శాంసంగ్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్లలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తోంది. బ్యాంక్‌ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లతో ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ప్రస్తుతం కార్డు ఆఫర్లేవీ అందుబాటులో లేవు. మరికొన్ని వేదికల్లో ఎక్స్ఛేంజీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ సిగ్నేచర్‌ క్రెడిట్‌ కార్డు సాయంతో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.2,500 తగ్గింపు ఉంటుంది. అదే యాక్సిస్‌ బ్యాంక్‌ ఇన్ఫినిటీ క్రెడిట్‌కార్డు ద్వారా అయితే రూ.5 వేల డిస్కౌంట్‌ పొందొచ్చు. అంటే మొత్తం రూ.15వేల వరకూ తగ్గింపుతో ఈ ఫోన్లు కొనుగోలు చేయొచ్చన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని