Qualcomm: భారత్‌లో క్వాల్‌కామ్‌ మరో రూ.177 కోట్ల పెట్టుబడులు

Qualcomm: చెన్నైలోని తమ కేంద్రాన్ని మరో కొత్త డిజైన్‌ సెంటర్‌తో విస్తరిస్తామని క్వాల్‌కామ్‌ తెలిపింది.

Updated : 07 Jan 2024 14:16 IST

దిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ క్వాల్‌కామ్‌ భారత్‌లో రూ.177 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తంతో చెన్నైలోని తమ తయారీ కేంద్రాన్ని కొత్త ‘డిజైన్‌ సెంటర్‌’తో విస్తరిస్తామని తెలిపింది. అదనంగా దాదాపు 1,600 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. చెన్నైలో ఆదివారం జరిగిన ‘తమిళనాడు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌’లో ఈ ప్రకటన చేసింది.

కొత్త సెంటర్‌లో వై-ఫై సాంకేతికతలపై దృష్టి సారిస్తూ వైర్‌లెస్‌ కనెక్టివిటీ పరిష్కారాలను అభివృద్ధి చేయనున్నట్లు క్వాల్‌కామ్‌ తెలిపింది. 5జీ సాంకేతికత అభివృద్ధిలో తమ ‘అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధి కేంద్రాని’కీ ఈ కొత్త సెంటర్‌ తన వంతు సహకారం అందిస్తుందని వెల్లడించింది. వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ పరిశ్రమలో ముందు వరుసలో ఉండాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని