ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ఆన్‌లైన్‌లో తెర‌వ‌డం ఎలా?

పొదుపు ఖాతాదారులు ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) చేయ‌వ‌చ్చు. దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పొదుపు ఖాతాదారుల‌కు ఈ స‌దుపాయాన్ని అందిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ఎస్‌బీఐ ఖాతాదారులు ఎక్క‌డి నుంచైనా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెర‌వ‌డంతో పాటు, నెట్‌బ్యాంకింగ్ ద్వారా నేరుగా ఖాతాలోకి న‌గ‌దు జ‌మ చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్ ..

Published : 17 Dec 2020 14:41 IST

పొదుపు ఖాతాదారులు ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) చేయ‌వ‌చ్చు. దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పొదుపు ఖాతాదారుల‌కు ఈ స‌దుపాయాన్ని అందిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ఎస్‌బీఐ ఖాతాదారులు ఎక్క‌డి నుంచైనా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెర‌వ‌డంతో పాటు, నెట్‌బ్యాంకింగ్ ద్వారా నేరుగా ఖాతాలోకి న‌గ‌దు జ‌మ చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్ ద్వారానే ఖాతాను పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు లేదా పూర్తిగా రద్దు చేయోచ్చు. ఇందులో ఏ ప‌నికి ఖాతాదారుడు బ్యాంకుకు వెళ్ళాల్సిన అవ‌స‌రం లేదు.

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) ఖాతాను ఆన్‌లైన్‌లో తెరిచే విధానం:

  1. ముందుగా మీ వ్య‌క్తిగ‌త వివ‌రాల ద్వారా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వాలి.
  2. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్ష‌న్‌లో ఇ-టీడీఆర్‌/ఇ-ఎస్‌టీడీఆర్‌(ఎఫ్‌డీ) ల‌లో ఒక‌దాన్ని ఎంచుకుని ప్రొసీడ్‌ని క్లిక్ చేయాలి. టీడీఆర్ అనేది ట‌ర్మ్ డిపాజిట్‌. ఎస్‌టీడీఆర్ అనేది స్పెష‌ల్ ట‌ర్మ్ డిపాజిట్‌. ఎస్‌టీడీఆర్ విధానంలో మెచ్యూరిటీ స‌మ‌యంలో మాత్ర‌మే వ‌డ్డీ చెల్లిస్తారు. అయితే టీడీఆర్‌లో మాత్రం ఎంచుకున్న క్ర‌మ వ్య‌వ‌ధు(ఇంట‌ర్‌వెల్స్‌)ల‌లో వ‌డ్డీ చెల్లిస్తారు.
  3. ఈ రెండింటిలో మీకు కావ‌ల‌సిన ఎఫ్‌డీని ఎంచుకుని ప్రొసీడ్‌ను క్లిక్ చేయాలి.
  4. మీకు ఒక‌టి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే, ఏ బ్యాంకు ఖాతా నుంచి న‌గ‌దు డిడ‌క్ట్ చేయాలో ఎంపిక చేసుకోవాలి.
  5. ఎఫ్‌డీ విలువ‌ను ఎంపిక చేసుకుని, ఆమొత్తాన్ని అమౌంట్ కాల‌మ్‌లో నింపాలి. ఒక‌వేళ మీ వ‌య‌సు 60 సంవ‌త్స‌రాల‌కు మించితే సీనియ‌ర్ సిట‌జ‌న్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. సాధార‌ణ ఖాతాదారుల‌తో పోలిస్తే, సీనియ‌ర్ సిటిజ‌న్లకు 50 బేసిస్ పాయింట్ల మేర అద‌న‌పు వ‌డ్డీ ల‌భిస్తుంది.
  6. ఇప్పుడు డిపాజిట్ కాల‌వ్య‌వ‌ధిని- సంవ‌త్స‌రాలు/నెల‌లు/రోజులు లేదా మెచ్యూరిటీ తేదిని ఎంచుకోవాలి.
  7. ఒక‌వేళ మీరు ట‌ర్మ్ డిపాజిట్‌ని ఎంచుకుంటే, మెచ్యూరిటీకి సంబంధిత సూచ‌న‌లు కూడా ఇక్క‌డే ఇవ్వాల్సి ఉంటుంది.
  8. నియ‌మ నిబంధ‌న‌లను క్షుణంగా ప‌రిశీలించి స‌బ్మిట్ క్లిక్ చేయాలి.
  9. మీ పేరు, నామినీ మొద‌లైన వివరాలు స్క్రీన్ మీద వ‌స్తాయి. మ‌రొక‌సారి స‌రిచూసుకుని ఒకే క్లిక్ చేయాలి.
  10. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం ట్రాన్సాక్ష‌న్ నెంబ‌రును రాసి ఉంచుకోవ‌డం మంచింది. దీనిని మీరు ప్రింట్ అవుట్ తీసుకోవ‌చ్చు లేదా పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో సేవ్ చేసుకోవ‌చ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని