Stock Market: స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్లు..

దేశీయ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ద్రవ్యోల్బణ భయాలు తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగివస్తుండటం మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపిస్తున్నప్పటికీ.

Published : 17 Aug 2022 09:41 IST

ముంబయి: దేశీయ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ద్రవ్యోల్బణ భయాలు తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగివస్తుండటం మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపిస్తున్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో సూచీలు ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి.

ఉదయం 9.35 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 124 పాయింట్ల లాభంతో 59,966.34 వద్ద, నిఫ్టీ 44.85 పాయింట్ల స్వల్ప లాభంతో 17,870.10 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్టీపీసీ, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, భారత్‌ పెట్రోలియం, హీరో మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు రాణిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు కోలుకుని 79.30 వద్ద కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని