డెట్‌ ఫండ్లలో రిస్క్ ఎంత‌?

డెట్‌ ఫండ్లలో సేకరించిన పెట్టుబడి మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన స్థిర ఆదాయ పెట్టుబడి సాధనాలైన టీ- బిల్లులు, దీర్ఘ, స్వల్ప కాల బాండ్లలో, బ్యాంకులు ఇత్రర ఆర్ధిక సంస్థలు జారీ చేసే సీడీ, సీపీ, ఇదే కాక కార్పొరేట్‌ సంస్థలు విడుదల చేసే...

Updated : 02 Jan 2021 14:56 IST

డెట్‌ ఫండ్లలో సేకరించిన పెట్టుబడి మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన స్థిర ఆదాయ పెట్టుబడి సాధనాలైన టీ- బిల్లులు, దీర్ఘ, స్వల్ప కాల బాండ్లలో, బ్యాంకులు ఇత్రర ఆర్ధిక సంస్థలు జారీ చేసే సీడీ, సీపీ, ఇదే కాక కార్పొరేట్‌ సంస్థలు విడుదల చేసే డిబెంచర్లు మొదలైన వాటిలో పెట్టుబడి చేస్తారు. తక్కువ నష్టభయం, స్థిరమైన రాబడి వచ్చే సాధనాలలో మదుపుచేయాలనుకునే వారికి డెట్‌ పథకాలు అనుకూలంగా ఉంటాయి. పేరుకు తగ్గట్టు ఈ ఫండ్‌ రుణాలపై ఆధారపడి పనిచేస్తాయి. పెట్టుబడికి ఎంచుకున్న సాధనాలు, పెట్టుబడి కాలావధిని అనుసరించి పెట్టుబడిదారుల అవసరాలకు అనుకూలంగా వివిధ రకాల డెట్‌ మ్యూచువల్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే డెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల స్థిరమైన రాబడి వచ్చే అవకాశాలున్నాయి. ఒక్క రోజు నుంచి కొన్ని సంవత్సరాలపాటు పెట్టుబడి పెట్టేందుకు అనుకూలమైన డెట్‌ పథకాలు అందుబాటులో ఉన్నాయి.

డెట్ ఫండ్ల‌లో ఎందుకు మ‌దుపు చేయాలి?

అభివృద్ధి చెందుతున్న దేశాల‌తో పోలిస్తే భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థలో వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌. డెట్ ఫండ్ల మీద వ‌డ్డీ రేట్లు గ‌రిష్ఠంగా 9-10 శాతం ఉంటాయి. ఇటీవ‌ల జారీ చేసిన డీహెచ్ఎఫ్ఎల్, జేఎమ్ ఫైనాన్షియ‌ల్ ఎన్‌సీడీల కూప‌న్ రేటు 9.75 శాతంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ప‌న్నుల విధానం:

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ప‌న్ను రేట్లు 33 శాతం వ‌ర‌కు ఉన్నాయి. డెట్ ఫండ్ల‌లో ఎంత ఎక్కువ కాలం మ‌దుపు చేస్తే అంత ప‌న్ను ఆదా అవుతుంది. డెట్ ఫండ్ల‌లో మూల‌ధ‌నంపై ఆధార‌ప‌డి ఉంటుంది. మూడు, నాలుగేళ్ల త‌ర్వాత దీనిపై కూడా ప‌న్ను ఉండ‌క‌పోవ‌చ్చు.

వివిధ రకాల డెట్‌ ఫండ్లు:

స్వ‌ల్ప కాలిక (షార్ట్ ట‌ర్మ్‌) డెట్ ఫండ్లు:

వీటిని లిక్విడ్ ఫండ్లు అని కూడా అంటారు. స్వ‌ల్ప కాలిక పెట్టుబ‌డులకు ఇది స‌రిపోతుంది. అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ఇదొక మంచి సాధ‌నం.

మ‌ధ్య‌కాలిక (మీడియం ట‌ర్మ్‌) డెట్ ఫండ్లు:

వీటికి 18 నెల‌ల నుంచి మూడేళ్ల వ‌ర‌కు కాల‌ప‌రిమితి ఉంటుంది. ఇవి స్వ‌ల్ప‌కాలిక, క్రెడిట్ రిస్క్ ఫండ్లు

దీర్ఘ‌కాలిక (లాంగ్ ట‌ర్మ్‌) డెట్ పండ్లు:

బాండ్ ఫండ్లు-

డెట్ ఫండ్ల‌లో ఉండే రిస్క్ ఎంత‌?

వ‌డ్డీ రేట్లు:

కేంద్ర బ్యాంకుల వ‌డ్డీ రేట్ల విధానంపై ఆధార‌ప‌డి బాండ్ల ధ‌ర‌లు ఉంటాయి. మెచ్యూరిటీ ఎక్కువ కాలం ఒడుదొడుకులు ఉండే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ రిస్క్ కూడా ఉండొచ్చు.

క్రెడిట్ రిస్క్:

డెట్ ఫండ్ల‌లో త‌క్కువ పెట్టుబ‌డులు చేస్తే ఎక్కువ రిస్క్ ఉంటుంది. మెచ్యూరిటీ స‌మ‌యంలో ఫండ్ సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి రిస్క్ త‌క్కువ‌గా, ఎక్కువ‌గా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని