కోర్ బ్యాంకింగ్ సొల్యూష‌న్స్ (సీబీఎస్) అంటే

ప్ర‌భుత్వరంగ బ్యాంకులు అన్ని ర‌కాల బ్యాంకింగ్ సేవ‌ల‌ను కోర్ బ్యాంకింగ్ సొల్యూష‌న్స్ కు అనుసంధానం చేయాల‌నుకోవ‌డం ప్రస్తుతం వార్త‌ల్లో విశేషంగా మారింది. ఇంత‌కీ కోర్ బ్యాంకింగ్ సొల్యూష‌న్ అంటే ఏంటి? వీటితో ఆర్థిక‌నేరాలు..

Published : 16 Dec 2020 15:27 IST

ప్ర‌భుత్వరంగ బ్యాంకులు అన్ని ర‌కాల బ్యాంకింగ్ సేవ‌ల‌ను కోర్ బ్యాంకింగ్ సొల్యూష‌న్స్ కు అనుసంధానం చేయాల‌నుకోవ‌డం ప్రస్తుతం వార్త‌ల్లో విశేషంగా మారింది. ఇంత‌కీ కోర్ బ్యాంకింగ్ సొల్యూష‌న్ అంటే ఏంటి? వీటితో ఆర్థిక‌నేరాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డొచ్చా?

పీఎన్‌బీ స్కామ్ బ‌య‌ట‌ప‌డ్డాక చాలా సందేహాలు క‌లుగుతున్నాయి. అంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జ‌రుగుతున్నా అధికారుల‌కు ఎలాంటి స‌మాచారం తెలియ‌క‌పోవ‌డం ఏంటి? లేదా అలాంటి ఏర్పాట్లు మ‌న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో లేవా? దీనికి ముందు మ‌నం కోర్ బ్యాంకింగ్ సొల్యూష‌న్స్ గురించి తెలుసుకుంటే ఈ విష‌యంలో మ‌న‌కు కొంత స్ప‌ష్ట‌త వ‌స్తుంది

బ్యాంకులు ప్ర‌ధానంగా అందించే సేవ‌లైన రుణాలివ్వ‌డం, డిపాజిట్లు స్వీక‌రించ‌డం, వ‌డ్డీరేట్ల మార్పు, క‌నీస బ్యాలెన్స్, లావాదేవీల సంఖ్య‌, ఖాతా స్టేట్‌మెంట్లు త‌దిత‌ర సేవ‌ల‌ను కోర్ బ్యాంకింగ్ సొల్యూష‌న్లని పిలుస్తుంటారు.

కోర్ అంటే

కోర్ ( సీఓఆర్ఈ - సెంట్ర‌లైజ్‌డ్ ఆన్ లైన్ రియ‌ల్ టైమ్ ఎక్స్చేంజ్ ) అంటే ఒక కేంద్రీకృత‌ డేటాబేస్ . బ్యాంకులకు చెందిన ప‌లు బ్రాంచీల, ఖాతాదార్ల‌ స‌మాచారం ఇందులో నిక్షిప్త‌మై ఉంటుంది. వివిధ బ్రాంచీల్లో చేస్తున్న లావాదేవీలు ఎప్ప‌టిక‌ప్పుడు ఈ కోర్ డేటాబేస్ ను చేరుతుంది. దీంతో ఖాతాదార్లు ఏ బ్రాంచీ నుంచైనా స‌రే త‌మ లావాదేవీలు సులువుగా చేసుకోవ‌చ్చు.

గ‌తంలో కోర్ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ రాక‌ముందు ఏ బ్రాంచీలో ఖాతా ఉంటే ఆ బ్రాంచికి మాత్ర‌మే వెళ్లాల్సి ఉండేది. కోర్ తో ఇప్పుడు ఎక్క‌డైనా, ఎప్పుడైనా వివిధ ర‌కాల ప‌ద్ద‌తుల్లో లావాదేవీలు చేయ‌వ‌చ్చు.

కోర్ బ్యాంకింగ్ సొల్యూష‌న్స్ ద్వారా ఖాతాదార్ల‌కు క‌లిగే లాభాలు

  • వివిధ ప‌ద్ధ‌తుల్లో బ్యాంకింగ్ సేవ‌ల అందుబాటులోకి రావ‌డం.

  • గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సేవ‌లు సుల‌భంగా ల‌భించ‌డం.

  • త‌క్కువ స‌మ‌యంలో లావాదేవీలు పూర్త‌వ‌డం.

  • ఖాతాదార్లు త‌మ కార్య‌క‌లాపాల‌ను తొంద‌ర‌గా ముగించుకునేందుకు తోడ్ప‌డుతుంది.

చాలా ఏళ్ల క్రితం బ్యాంకులో ఈ రోజు లావాదేవీ చేస్తే మ‌రుస‌టి రోజుకు గానీ అప్‌డేట్ అయ్యేది కాదు. ప్ర‌స్తుతం ఇలా పంపితే అలా అప్‌డేట్ అవుతుంది.

బ్యాంకుల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు

  • బ్యాంకింగ్ లావాదేవీల‌కు సంబంధించిన‌ స‌మాచారం మొత్తం సెంట్ర‌ల్ డేటాబేస్ కు అనుసంధానం కావ‌డంతో పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంది. త‌మ ఖాతాదార్ల‌కు సంపూర్ణ‌మైన సేవ‌ల‌ను అందించేందుకు ఈ వ్య‌వ‌స్థ తోడ్ప‌డుతుంది.

  • భార‌తీయ‌ రిజ‌ర్వు బ్యాంకు, ప్ర‌భుత్వానికి నివేదిక‌లు ఇత‌ర స‌మాచారం అందించ‌డం బ్యాంకుల‌కు సుల‌భ‌త‌రంగా ఉంటుంది.

  • బ్యాంకులు త‌మ వినియోగ‌దార్ల ఖాతాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించేందుకు కోర్ బ్యాంకింగ్ సొల్యూష‌న్స్ ఉప‌యుక్తంగా ఉంటుంది.

  • బ్యాంకు ఖాతాలు తెర‌వ‌డం, ర‌ద్దు చేయ‌డం, వ‌డ్డీ రేట్ల మార్పులు మొద‌లైన వాటిని వేగంగా అమ‌లు చేయ‌డం లాంటి ప‌నుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా చేయ‌వ‌చ్చు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని