Whatsapp accounts: మే నెలలో 19 లక్షల వాట్సాప్‌ ఖాతాలు బ్యాన్‌

దేశంలో మే నెలలలో 19 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్‌ (Whatsapp) వెల్లడించింది.

Published : 01 Jul 2022 22:08 IST

దిల్లీ: దేశంలో మే నెలలలో 19 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్‌ (Whatsapp) వెల్లడించింది. గ్రీవెన్స్‌ ద్వారా వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సొంత మెకానిజం ఆధారంగా ఈ ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు వాట్సాప్‌ తెలిపింది. ఈ మేరకు మే నెలకు సంబంధించి వివరాలను వెల్లడించింది.

నూతన ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షలకు పైబడి ఉన్న డిజిటల్‌ వేదికలు ప్రతినెలా ఫిర్యాదులు, వాటికి తీసుకున్న చర్యలకు సంబంధించి ఓ నివేదికను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి మే 31 మధ్య కాలంలో 19 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇదే రీతిలో ఏప్రిల్‌ నెలలో 16 లక్షల ఖాతాలను వాట్సాప్‌ తొలగించగా.. అంతకుముందు నెల మార్చిలో 18.05 లక్షల ఖాతాలపై వాట్సాప్‌ నిషేధం విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని