బాలుడిని కాపాడేందుకు వెళ్లి.. బావిలో పడ్డ 40మంది

మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాలుడిని రక్షించేందుకు వెళ్లి 30 మంది బావిలో పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 19 మందిని కాపాడారు. గంజ్‌బసోడ గ్రామంలో గురువారం

Updated : 16 Jul 2021 12:27 IST

నలుగురు మృతి.. పలువురికి గాయాలు

విదిశ: మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాలుడిని రక్షించేందుకు వెళ్లి 40 మంది బావిలో పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 19 మందిని కాపాడారు. గంజ్‌బసోడ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

గంజ్‌బసోడ గ్రామంలో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో  ఓ బాలుడు ప్రమాదవశాత్తూ బావిలో పడ్డాడు. 50 అడుగుల లోతున్న ఆ బావిలో 20 అడుగుల వరకు నీరుంది. బాలుడు పడిపోయిన విషయం తెలియగానే కొంతమంది స్థానికులు బావిలోకి దిగి రక్షించే ప్రయత్నం చేశారు. మరికొందరు బావి గోడ దగ్గర నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బావి గోడ కూలిపోయింది. దీంతో వారంతా బావిలో పడిపోయారు. 

సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. అదే సమయంలో బావి పక్కన ప్రాంతం కుంగడంతో సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ ట్రాక్టర్‌ కూడా బావిలోకి జారిపడింది. అందులో నలుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు. మొత్తం 40 మందికి పైగా బావిలో పడినట్లు తెలిసింది. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. 19 మందిని బావి నుంచి కాపాడి ఆసుపత్రికి తరలించారు. నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

సీఎం రూ.5లక్షల నష్టపరిహారం..

ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు సీఎం ట్విటర్‌ వేదికగా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని