Prakasam: ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై అత్యాచారం

వ్యద్ధురాలిపై మద్యం మత్తులో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 30 Dec 2023 12:14 IST

ప్రకాశం: వ్యద్ధురాలిపై మద్యం మత్తులో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి కమలనాథ్ అనే యువకుడు మద్యం మత్తులో చొరపడ్డాడు. వెంటనే వృద్ధురాలు కేకలు వేయడంతో అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. ఆపై విషయాన్ని కుటుంబ సభ్యులకు వృద్ధురాలు చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఆరోగ్యం మెరుగ్గా లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని