Drugs Case: అభిషేక్‌ కాల్‌ లిస్టు ఆధారంగా ప్రశ్నలు.. మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం

బంజారాహిల్స్‌ ఫుడింగ్‌ పబ్‌ కేసులో సహ భాగస్వామి అభిషేక్‌, మేనేజర్‌ అనిల్‌ను పోలీసులు 4గంటల పాటు విచారించారు. అభిషేక్‌ కాల్‌లిస్టు ఆధారంగా ప్రశ్నలు అడిగిన పోలీసులు

Published : 15 Apr 2022 01:32 IST

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ ఫుడింగ్‌ పబ్‌ కేసులో సహ భాగస్వామి అభిషేక్‌, మేనేజర్‌ అనిల్‌ను పోలీసులు 4గంటల పాటు విచారించారు. అభిషేక్‌ కాల్‌లిస్టు ఆధారంగా ప్రశ్నలు అడిగిన పోలీసులు.. పబ్‌కు హాజరైన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఇద్దరినీ ఏసీపీ స్థాయి అధికారి సమక్షంలో విడివిడిగా విచారించారు. పబ్‌ భాగస్వాములు, అగ్రిమెంట్లతో పాటు పార్టీకి వారం కంటే ముందే డ్రగ్స్‌ తీసుకొచ్చిన వ్యవహారంపై పోలీసులు ప్రశ్నించారు. ఇద్దరి చరవాణుల్లో పలువురు మాదక ద్రవ్యాల విక్రేతల నంబర్లు ఉండటాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. గోవా, ముంబయి నుంచి కొకైన్‌ తీసుకొచ్చి పబ్‌లో అమ్ముతున్నట్టు అనుమానిస్తున్నారు. ఇద్దరు నిందితులను మరో 3 రోజుల పాటు విచారించనున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈనెల 3న ఫుడింగ్‌ పబ్‌పై దాడి చేసిన పోలీసులు 148 మందిని అదుపులోకి తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పబ్‌లో 4.6గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని