Andhra News: కొవిడ్‌ బాధిత కుటుంబాలనూ వదలని సైబర్‌ నేరగాళ్లు.. నలుగురి అరెస్టు

కొవిడ్‌తో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించే వైఎస్‌ఆర్‌ బీమా సొమ్మును అందజేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న అంతర్జాతీయ ముఠా సభ్యులను కడప పోలీసులు అరెస్టు చేశారు.

Published : 23 Oct 2022 22:17 IST

కడప: కొవిడ్‌తో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించే వైఎస్‌ఆర్‌ బీమా సొమ్మును అందజేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న అంతర్జాతీయ ముఠా సభ్యులను కడప పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ కేంద్రంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి అంతర్జాతీయ రాకెట్‌ నిర్వహిస్తున్న నలుగురు ముఠా సభ్యులను ఇవాళ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. నేపాల్‌కు చెందిన నలుగురు ముఠా సభ్యుల నుంచి 73 సిమ్‌ కార్డులు, సెల్‌ఫోన్లు, రూ. 4లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అదనపు ఎస్పీ తుషార్‌ డూడి తెలిపారు. ఇటీవల కాజీపేటకు చెందిన వెంకటేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిచ్చిన సమాచారం మేరకు నిందితులను గుర్తించామన్నారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఈ ముఠా మోసాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. దిల్లీలో ఉన్న మరికొందరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను చూసి మోసపోవద్దని అదనపు ఎస్పీ తుషార్‌ డూడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు