Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం
మంటలు అంటుకోవడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏఎంబీ ప్రాంతంలోని ఓ మురికివాడలోని రెండు గుడిసెలకు మంటలు అంటుకోవడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతులను బిహార్‌లోని దర్బంగా జిల్లా నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.
మృతుల్లో శివమ్ కుమార్(6), గోలుకుమార్ (7), నీతు (14) ఒకే కుటుంబానికి చెందిన వారు. వారితో పాటు పక్క ఇంట్లో ఉంటున్న సోను కుమార్ (17) సజీవ దహనమైనట్లు స్థానిక పోలీసు అధికారి పఠానియా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గుడిసెలకు మంటలు అంటుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్