మహిళా వ్యాపారవేత్తకు బెదిరింపు కాల్స్‌

మురికివాడల్లో సామాజిక దూరంపై ఫేస్‌బుక్‌లో ఉంచిన ఒక వీడియోపై వ్యాఖ్యానించిన మహిళా వ్యాపావేత్తకు బెదిరింపు కాల్స్‌ ఎదురవుతున్నారు. గోరెగావ్‌ పోలీసుల వివరాల ప్రకారం.. ‘మురికివాడల్లో సామాజిక దూరం ఓ భ్రమ’గా పేర్కొటూ..

Published : 28 Apr 2020 00:36 IST

కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ముంబయి: మురికివాడల్లో సామాజిక దూరంపై ఫేస్‌బుక్‌లో ఉంచిన ఒక వీడియోపై వ్యాఖ్యానించిన మహిళా వ్యాపారవేత్తకు బెదిరింపు కాల్స్‌ ఎదురవుతున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని గోరెగావ్‌ పోలీసుల వివరాల ప్రకారం.. ‘మురికివాడల్లో సామాజిక దూరం ఓ భ్రమ’గా పేర్కొంటూ తీసిన వీడియోను ఫేస్‌బుల్‌లో అప్‌లోడ్ చేసిన సామాజిక కార్యకర్తను ముంబైకి చెందిన ఓ స్టార్టప్ సహ యజమాని అయిన 33 ఏళ్ల మహిళ విమర్శించింది. ఆ వీడియోపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తన కళాశాల మిత్రునిపై సైతం కోపం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన సదరు మిత్రుడు ఆమెకు బుద్ధి వచ్చేలా గట్టిగా విమర్శించండి అంటూ కొందరిని ఫేస్‌బుక్‌లో ట్యాగ్‌ చేశాడు. కాగా ఈ వివాదం ముగిసిపోవాలని ఆ మహిళ వారిని బ్లాక్‌ చేసింది. 

కానీ ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి సదరు మహిళకు ఐదుగురు వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఆమెకు ఫోన్‌ చేసి దురుసుగా మాట్లాడటంతో పాటు క్షమాపణ తెలిపి ఆమె చేసిన కామెంట్లను తొలగించాల్సిందిగా బెదిరిస్తున్నారు.  దీంతో ఆ మహిళా పారిశ్రామికవేత్త ఆదివారం గోరెగావ్‌ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు