రౌడీమూకల కాల్పుల్లో 8మంది పోలీసుల మృతి

 కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. రౌడీమూకల కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. పోలీసలు వివరాల ప్రకారం.. రౌడీషీటర్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు.......

Updated : 21 Dec 2022 15:45 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. రౌడీమూకల కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు గురువారం-శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు వెళ్లారు. కాన్పూర్‌ సమీపంలోని డిక్రూ గ్రామంలో అతడు ఉంటున్న నివాసానికి చేరుకుంటున్న క్రమంలోనే ఓ ఇంటిపై మాటువేసిన దుండగులు పోలీసు బృందంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 60 క్రిమినల్‌ కేసుల్లో వికాస్‌దూబే నిందితుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాల్పులకు పాల్పడిన నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని