Crime News: పైన చేపల ఆహారం.. లోపల ఎర్రచందనం

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ రిశాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మాచర్ల గ్రామీణ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో గురజాల డీఎస్పీ మెహర్‌ప్రసాద్‌, గ్రామీణ, పట్టణ సీఐలు సురేంద్రబాబు, సుబ్బారావుతో కలసి విలేకర్లతో

Updated : 08 Dec 2021 08:01 IST

వాహనంలో రూ.20 లక్షల విలువైన దుంగల పట్టివేత


స్వాధీనం చేసుకున్న దుంగలు

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ రిశాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మాచర్ల గ్రామీణ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో గురజాల డీఎస్పీ మెహర్‌ప్రసాద్‌, గ్రామీణ, పట్టణ సీఐలు సురేంద్రబాబు, సుబ్బారావుతో కలసి విలేకర్లతో మాటాడుతూ వివరాలు వెల్లడించారు. గ్రామీణ జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాల మేరకు వచ్చిన సమాచారంతో 6న తెల్లవారుజామున నాగార్జున సాగర్‌ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద గ్రామీణ సీఐ సురేంద్రబాబు, ఎస్సై అనిల్‌కుమార్‌రెడ్డి, పోలీసు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో రెండు వాహనాల్లోని వారు హైదరాబాద్‌ నుంచి మాచర్ల వైపు వస్తూ పోలీసులను చూసి వెనక్కి తిప్పుకొని వెళ్లిపోతున్నారు. వారిని వెంబడించి వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. అందులో చేపల మేతకు వేసే బస్తాల కింద 78 ఎర్రచందనం దుంగలు, రెండో వాహనంలో పొట్టు బస్తాల కింద 133 దుంగలు మొత్తం కలిపి 211 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుంది. ఆ రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు, ఎర్రచందనం మొత్తం విలువ రూ.37 లక్షల వరకు ఉంటుంది. నిందితులు అట్ల తిరుమలరెడ్డి, యార్లగడ్డ చిరంజీవి, దుండి వాసిరెడ్డి, ఎస్‌కే షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించడంతో పాటు నగదు రివార్డు అందించారు. సమావేశంలో ఎస్సైలు అనిల్‌కుమార్‌రెడ్డి, పాల్‌ రవీందర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని