Hyderabad News: రాత్రికి రాత్రే సులభ్‌ కాంప్లెక్స్‌ మాయం

సఫిల్‌గూడ చౌరస్తాలోని సులభ్‌ కాంప్లెక్స్‌ను రాత్రికి రాత్రి చోరీ చేసి.. తుక్కుగా మార్చి విక్రయించిన నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ జగదీశ్వరరావు, మల్కాజిగిరి సర్కిల్‌ ఉప కమిషనర్‌ రాజు వివరాల ప్రకారం.. సఫిల్‌గూడ

Published : 22 Mar 2022 09:12 IST

 తుక్కుగా మార్చి రూ.45 వేలకు అమ్మకం

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: సఫిల్‌గూడ చౌరస్తాలోని సులభ్‌ కాంప్లెక్స్‌ను రాత్రికి రాత్రి చోరీ చేసి.. తుక్కుగా మార్చి విక్రయించిన నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ జగదీశ్వరరావు, మల్కాజిగిరి సర్కిల్‌ ఉప కమిషనర్‌ రాజు వివరాల ప్రకారం.. సఫిల్‌గూడ చౌరస్తాలోని పాదబాటపై ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌ ఈ నెల 16న కనిపించకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీసీ రాజు, డీఈ మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుణ్ని దోమల్‌గూడలో నివసించే మెదక్‌ జిల్లా అందోల్‌ మండలం అమ్మసాగరానికి చెందిన ముప్పారం జోగయ్య(36)గా గుర్తించారు. విచారించగా, జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం ప్రకటనల విభాగంలో పని చేస్తున్న అరుణ్‌కుమార్‌, జైన్‌ కన్‌స్ట్రక్షన్స్‌లో సూపర్‌వైజర్‌గా పని చేసే భిక్షపతి సహకారంతో ఈ పని చేసినట్లు అంగీకరించాడు. ఇనుప ఫ్రేమ్‌ను తుక్కుగా మార్చి రూ.45 వేలకు విక్రయించినట్లు తెలిపాడు. నిందితుణ్ని రిమాండ్‌కు తరలించి, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని