సంక్షిప్త వార్తలు (3)

దేశ రాజధాని నగరంలో దిల్లీ పోలీసుల ప్రత్యేకదళం అయిదుగురు యువకులను అరెస్టు చేసి 46 పిస్తోళ్లు, తూటాలను స్వాధీనం చేసుకొంది.

Updated : 04 Feb 2023 06:12 IST

దిల్లీలో 46 పిస్తోళ్ల స్వాధీనం..

దిల్లీ: దేశ రాజధాని నగరంలో దిల్లీ పోలీసుల ప్రత్యేకదళం అయిదుగురు యువకులను అరెస్టు చేసి 46 పిస్తోళ్లు, తూటాలను స్వాధీనం చేసుకొంది. నిందితులు పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల గ్యాంగ్‌స్టర్లకు అక్రమంగా ఆయుధాలను రవాణా చేస్తున్న ముఠాలకు చెందినవారని అధికారులు శుక్రవారం వెల్లడించారు.


మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఇద్దరి అరెస్టు

దిల్లీ: దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను నిందితులు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.


బైకును ఢీకొట్టి.. 3 కి.మీ. ఈడ్చుకెళ్లాడు
గురుగ్రామ్‌లో కారు డ్రైవరు అరెస్టు

గురుగ్రామ్‌: రహదారి పక్కనే ఆపిన ద్విచక్రవాహనాన్ని ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టి 3 కి.మీ. ఈడ్చుకెళ్లాడు. ఇతర వాహనదారులు అతణ్ని ఆపేందుకు ప్రయత్నించినా పట్టించుకోకుండా వాహనాన్ని అలాగే వేగంగా నడుపుకొంటూ వెళ్లాడు. చివరకు కారును ఓ చోట ఆపి పారిపోయాడు. హరియాణాలోని గురుగ్రామ్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు