లోయలో పడిన ట్రాక్టర్‌

రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ట్రాక్టర్‌ లోయలో పడడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.

Published : 30 May 2023 04:15 IST

రాజస్థాన్‌లో 8 మంది మృతి

జైపుర్‌: రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ట్రాక్టర్‌ లోయలో పడడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. సోమవారం సాయంత్రం ఉదయపూర్వతి ప్రాంతంలోని  మానస మాతా ఆలయంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో కొందరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ లోయలో పడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారని.. గాయపడిన వారిని ఝుంఝును ఆస్పత్రిలో చేర్పించామని అదనపు ఎస్పీ తేజ్‌పాల్‌ సింగ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని