36 ఏళ్ల తర్వాత నిందితురాలి అరెస్టు

మోసం కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితురాలిని సీఐడీ అధికారులు 36 ఏళ్ల తర్వాత అరెస్టుచేశారు. కేరళ రాష్ట్రంలోని పత్తనంతిట్ట జిల్లా, తుల్లపల్లికి చెందిన మరియమ్మ అలియాస్‌ లీలమ్మ జోసెఫ్‌, మరికొందరిపై హైదరాబాద్‌ సీసీఎస్‌లో 1987లో ఆర్థిక మోసానికి సంబంధించిన కేసు నమోదైంది.

Published : 31 May 2023 02:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: మోసం కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితురాలిని సీఐడీ అధికారులు 36 ఏళ్ల తర్వాత అరెస్టుచేశారు. కేరళ రాష్ట్రంలోని పత్తనంతిట్ట జిల్లా, తుల్లపల్లికి చెందిన మరియమ్మ అలియాస్‌ లీలమ్మ జోసెఫ్‌, మరికొందరిపై హైదరాబాద్‌ సీసీఎస్‌లో 1987లో ఆర్థిక మోసానికి సంబంధించిన కేసు నమోదైంది. తర్వాత ఇది సీఐడీకి బదిలీ అయింది. ఈ కేసులో ఆమె 11వ నిందితురాలిగా ఉంది. అప్పటి నుంచి పరారీలోనే ఉండడంతో ఆమెపై జారీ అయిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ పెండింగ్‌లోనే ఉంది. మహేష్‌ భగవత్‌ సీఐడీ అదనపు డీజీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెండింగ్‌ కేసులన్నీ బయటకు తీస్తున్నారు. ఇందులో భాగంగా మరియమ్మపై కేసు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడయింది. దాంతో సీఐడీ ఎస్పీ బి.రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. మరియమ్మ కేరళలో ఉన్నట్లు కనుగొన్నారు. ప్రత్యేక బృందం కేరళ వెళ్లి ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్‌ తరలించారు. న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని