
Crime: అంకుల్.. అని పిలిచినందుకు యువతిపై వ్యక్తి దాడి!
సితార్‌గంజ్: తనని అంకుల్ అని పిలిచిన యువతిపై ఓ వ్యక్తి దారుణంగా దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. ఉదమ్ సింగ్ నగర్‌లోని సితార్‌గంజ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గత వారం ఓ 18ఏళ్ల యువతి ఖాటిమా రోడ్డులో ఉన్న స్పోర్ట్స్ వస్తువుల విక్రయ దుకాణంలో బ్యాడ్మింటన్ రాకెట్ కొనుగోలు చేసింది. అయితే, ఆ రాకెట్ పాక్షికంగా విరిగిపోయి ఉండటంతో దాని బదులు మరో రాకెట్ తీసుకోవడానికి ఆ దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో అందులో పనిచేసే 35ఏళ్ల మోహిత్ కుమార్‌ని అంకుల్ అని సంభోదిస్తూ సమస్య వివరించే ప్రయత్నం చేసింది. అయితే, తనను అంకుల్ పిలవడంతో ఆగ్రహించిన మోహిత్.. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో దుకాణ యజమాని వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఘటనపై విచారించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో మోహిత్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
► Read latest Crime News and Telugu News