
మానసిక వైద్యశాలకు మదనపల్లె నిందితులు
మదనపల్లె: మూఢభక్తితో కన్నకూతుళ్లను చంపుకొన్న చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన దంపతులు పురుషోత్తం, పద్మజలను బుధవారం ఉదయం పోలీసులు విశాఖ మానసిక చికిత్సాలయానికి తరలించారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టు చేసిన అనంతరం నిందితులను మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. వారి మానసిక స్థితి బాగా లేకపోవడంతో ఇటీవల నిందితులను తిరుపతి రుయాకు తరలించారు. పరీక్షించిన వైద్యులు పురుషోత్తం, పద్మజకు కస్టోడియన్ కేర్ కావాలని సూచించారు.
ఇలాంటి పరిస్థితుల్లో జైలు వాతావరణంలోనే చికిత్స అందించేందుకు వీలుగా సరైన వ్యవస్థ ఉండాలన్నారు. జైలులో అలాంటి వసతులు లేనందునే విశాఖలోని కస్టోడియన్ కేర్‌కు నిందితులను తరలించాలని సిఫార్సు చేసినట్లు రుయా వైద్యులు తెలిపారు.
ఇవీ చదవండి..
‘కాళికనని.. నాలుక కోసి తినేసింది’
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.