Andhra News: పింఛను తీసుకునేందుకు వచ్చి.. ఒడిశా రైలు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన గురుమూర్తి(63) ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు.

సంతబొమ్మాలి: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన గురుమూర్తి(63) ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ మేరకు అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గురుమూర్తి మృతదేహాన్ని గుర్తించి శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. గురుమూర్తి మే 30వ తేదీన పింఛన్ తీసుకోవడానికి జగన్నాథపురం గ్రామానికి వచ్చారు. పింఛన్ తీసుకున్న అనంతరం శుక్రవారం తిరుగు ప్రయాణంలో యశ్వంతాపూర్- హావ్‌డా ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. ఈ క్రమంలో బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో బోగీల మధ్య ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. గత కొన్నేళ్లుగా గురుమూర్తి బాలేశ్వర్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు.
ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన పలువురు ప్రయాణికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణించిన 113 మంది, యశ్వంతాపూర్- హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన 28 మంది ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. వారి సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో అధికారుల బృందం ఘటనా స్థలికి బయలుదేరి వెళ్లింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vivek Ramaswamy: వివేక్ రామస్వామితో డిన్నర్ ఆఫర్.. ఒక్కొక్కరికి 50 వేల డాలర్లపైమాటే!
-
ముందు ఈ మూడు పనులు చేయండి.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు