Crime: ఇదేం మాస్క్‌ రా బాబు!

గతేడాది నుంచి కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్క్‌ ధరించడం మనందరం అలవాటుగా మార్చుకున్నాం. ఇక్కడో వ్యక్తి మాత్రం మాస్క్‌ ధరించినందుకే ఊసలు లెక్కపెడుతున్నాడు. ఇంతకి ఏమిటా మాస్క్‌ ఎందుకలా అరెస్ట్‌ అయ్యాడనే విషయానికొస్తే.. అది పాకిస్థాన్‌లోని పేష్వార్‌ నగరం. రోడ్డున వెళ్లేవారందరిని కాస్ట్యూమ్‌ మాస్క్‌ ధరించి భయపెడుతూ వచ్చాడా ప్రబుద్ధుడు.

Updated : 10 Aug 2021 19:47 IST

భయపెట్టే మాస్క్‌ ధరించాడని ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది నుంచి కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్క్‌ ధరించడం మనందరం అలవాటుగా మార్చుకున్నాం. ఇక్కడో వ్యక్తి మాత్రం మాస్క్‌ ధరించినందుకే ఊసలు లెక్కపెడుతున్నాడు. ఇంతకి ఏమిటా మాస్క్‌ ఎందుకలా అరెస్ట్‌ అయ్యాడనే విషయానికొస్తే.. అది పాకిస్థాన్‌లోని పెషావర్‌ నగరం. రోడ్డున వెళ్లేవారందరిని కాస్ట్యూమ్‌ మాస్క్‌ ధరించి భయపెడుతూ వచ్చాడా ప్రబుద్ధుడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతడి వికృత చేష్టలను గమనించి.. అదే మాస్క్‌లో ఉన్న అతడిని బేడీలు వేసి అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు ఇతగాడి ఫొటోలను పోలీసులు విడుదల చేయగా.. పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌ నైలా ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఇలా భయపెడుతూ పండుగలు జరుపుకోవడం ఇక్కడ తొలిసారేమీ కాదు. ఈఏడాది న్యూఇయర్‌ సందర్భంగా ఓ వ్యక్తి తోడేలు రూపంలో ఉన్న మాస్క్‌ ధరించి అరెస్ట్‌ అయ్యాడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని