Road Accident: నల్గొండ జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

Updated : 31 May 2022 05:34 IST

నల్గొండ: నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి వెళ్లి సహాయచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్‌ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని