Crime news: ఆన్‌లైన్‌ పరిచయం.. విద్యార్థిని ప్రాణాలను బలితీసుకుంది!

ఆన్‌లైన్‌ పరిచయం ఓ విద్యార్థిని ప్రాణాల్ని బలితీసుకుంది. ఓ యువకుడి వేధింపుల్ని భరించలేక 16ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కాసరగోడ్‌లో చోటు చేసుకుంది.

Published : 30 Jan 2024 02:15 IST

కాసరగోడ్‌: సామాజిక మాధ్యమాల వేదికగా పరిచయమైన ఓ యువకుడి వేధింపులకు 16 ఏళ్ల విద్యార్థిని బలైపోయింది. కేరళకు చెందిన విద్యార్థిని వారం రోజుల క్రితం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని బడియడ్కకు చెందిన హైస్కూల్‌ విద్యార్థిని(16) గత మంగళవారం తన ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంగళూరులోని ఆసుపత్రిలో చేర్పించగా.. 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం ప్రాణాలు విడిచినట్లు పోలీసులు వెల్లడించారు.  ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. 

తన కూతురికి సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన అన్వర్‌ (24) అనే యువకుడు పాఠశాలకు వెళ్లేదారిలో వెంటపడి వేధింపులకు గురిచేసేవాడని.. అందువల్లే ఆమె విషం తాగినట్లు బాలిక తండ్రి ఆరోపించారు. అతడికి పలుమార్లు హెచ్చరించినా వినలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్వర్‌తో తన కుమార్తె ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు గుర్తించి దూరంగా ఉంచేందుకు ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. వార్నింగ్‌ ఇవ్వడమే కాకుండా కూతురి ఫోన్‌లో అతడి మొబైల్‌ నంబర్‌నూ బ్లాక్‌ చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి తన కుమార్తె స్కూల్‌కు వెళ్తున్న మార్గంలో వేధిస్తుండేవాడని.. ఆ కుటుంబంలో జరగాల్సిన ఓ పెళ్లిని అడ్డుకోవడమే కాకుండా తనకు హాని తలపెడతానని హెచ్చరించాడని బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి నిందితుడితో పాటు మరో యువకుడిని బెంగళూరులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు