
Published : 03 Sep 2021 01:59 IST
Gold Smuggling: ఫేస్ క్రీం బాక్స్ తెరిచి చూడ.. బంగారం ఉండు!
శంషాబాద్: హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 495గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫేస్ క్రీం బాక్సు, శాండిల్స్‌లో దాచిపెట్టి తీసుకొచ్చినట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.24.14 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి
Tags :