
Updated : 30 Sep 2021 10:50 IST
Crime News: విద్యుదాఘాతం.. మంటల్లో చిక్కుకొని వ్యక్తి సజీవ దహనం
దాచేపల్లి: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. దాచేపల్లి మండలం తక్కెళ్లపాడులో జక్క లక్ష్మీనారాయణ(45) ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మంటలు చెలరేగి అందులో చిక్కుకున్న లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
ఇవీ చదవండి
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.