రవాణా కష్టాలు మళ్లీ మొదలు..
కాగజ్‌నగర్- దహెగాం ప్రధాన రహదారి మార్గంలో మళ్లీ రవాణా కష్టాలు మొదలయ్యాయి. వంతెన నిర్మించక ముందు పడిన ఇక్కట్లు 22 ఏళ్ల తర్వాత పునరావృతం అయ్యాయి.
మరింత కుంగిన పెద్దవాగు వంతెన
కాగజ్‌నగర్‌గ్రామీణం, దహెగాం న్యూస్‌టుడే
అందవెల్లి పెద్దవాగు వంతెన వద్ద కుంగిన పిల్లర్
కాగజ్‌నగర్- దహెగాం ప్రధాన రహదారి మార్గంలో మళ్లీ రవాణా కష్టాలు మొదలయ్యాయి. వంతెన నిర్మించక ముందు పడిన ఇక్కట్లు 22 ఏళ్ల తర్వాత పునరావృతం అయ్యాయి. పెద్దవాగు వంతెనపై పిల్లర్ మరింత కుంగడంతో సమస్య మొదటికొచ్చింది. 1999 సంవత్సరం కంటే మొదలు ఈ మార్గంలోని ఒర్రెలు, వాగులపై వంతెనలు, రోడ్డు నిర్మాణాలు లేక ఎన్నో అవస్థలు పడ్డారు. 2000 సంవత్సరంలో కాగజ్‌నగర్ నుంచి దహెగాం వరకు బీటీ రోడ్డు, పెద్దవాగుతో పాటు పలువాగులు, ఒర్రెలపై వంతెనల నిర్మాణాలు జరిగాయి. ఫలితంగా కాగజ్‌నగర్ మండలంలోని జగన్నాథపూర్, జివ్వాజీగూడ, జెండాగూడ, బోడేపల్లి గ్రామాలతో పాటు దహెగాం మండలంలోని గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గత సంవత్సం ఆగస్టు మాసంలో కురిసిన భారీవర్షాల వరద కారణంగా పెద్దవాగు ఉప్పొంగి ప్రవహించింది. ఈ కారణంగా వంతెన ఓ పిల్లరు కుంగిపోయింది. అప్పట్లో ఈ వంతెనపై నుంచి కొద్దిరోజుల పాటు వాహనాల రాకపోకలను నిషేధించి తర్వాత అనుమతించారు. ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పెద్దవాగు రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించింది. ఫలితంగా అదే పిల్లరు మరింత కుంగిపోయింది. ఆదివారం వంతెనను పరిశీలించిన అధికారులు ప్రమాదాన్ని ముందే పసిగట్టి రాకపోకలను నిషేధించారు. వంతెనకు అడ్డంగా యుద్ధప్రాతిపదికన వాహనాలు వెళ్లకుండా గోడలు కట్టించారు. మరోవైపు బీబ్రా- కోత్మీర్ గ్రామాల మధ్య బీటీ రోడ్డు పెద్దవాగు వరదతో కొట్టుకుపోయింది. ఎలాంటి వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రెండు పిల్లర్ల మధ్య ఏర్పడిన ఖాళీ
రాకపోకలు నిలిపివేసిన అధికారులు
కాగజ్‌నగర్‌గ్రామీణం: కాగజ్‌నగర్- దహెగాం ప్రధాన రహదారి మార్గంలో అందవెల్లి వద్ద పెద్దవాగు వంతెన మరింత ప్రమాదకర స్థితికి చేరడంతో అధికారుల బృందం ఆదివారం పరిశీలించింది. గత సంవత్సరం కురిసిన వర్షాలకు వంతెన ఓ పిల్లరు కుంగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు వరద కారణంగా ఆ పిల్లరు మరింత కుంగింది. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పలువురు అధికారులు వంతెన పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సీఐ నాగరాజు, తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, రోడ్డు భవనాలశాఖ డీఈ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాస్, నాయకులు చన్కపురే గణపతి, కె.రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
రాకపోకలు సాగించకుండా వంతెనపై అడ్డంగా కడుతున్న గోడ
త్వరగా మరమ్మతులు చేయాలి
- చెమ్మకారి గంగన్న, లగ్గాం, దహెగాం
పెద్దవాగు వంతెనతో పాటు రోడ్లు త్వరగా బాగు చేయాలి. పెద్దవాగు వంతెన బాగున్న రోజుల్లో దహెగాం నుంచి కాగజ్‌నగర్‌కు ప్రయాణ దూరం 30 కిలోమీటర్లు మాత్రమే. నేడు బెల్లంపల్లి మీదుగా కాగజ్‌నగర్‌కు రావాలంటే 70 కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సి ఉంటుంది. ఫలితంగా వ్యయప్రయాసలు తప్పేలా లేవు. అధికారులు, పాలకులు స్పందించి రవాణా సౌకర్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య
-
World News
Miss Universe : మిస్ యూనివర్స్ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!
-
Movies News
Samantha: ఎంతోకాలం తర్వాత గాయని చిన్మయి గురించి సమంత ట్వీట్
-
India News
Parliament: ‘అదానీ - హిండెన్‌బర్గ్’పై చర్చకు విపక్షాల పట్టు.. పార్లమెంట్లో గందరగోళం
-
Crime News
Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ